Jr NTR to play Both Hero and villain Roles in Prashanth Neel Film: జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తాను చేయాల్సిన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే తన 30వ సినిమా కొరటాల శివతో ఉంటుందని ఎన్టీఆర్ ప్రకటించారు. ఇక ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ నవంబర్ నెల నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల కొరటాల శివ చెప్పిన ఫైనల్ స్క్రిప్ట్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం కొరటాల శివ బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో హీరోయిన్ గా నటించేది ఆమేనంటూ పలు పేర్లు వినిపించాయి. అలియా భట్ కూడా నటించే అవకాశం ఉందని అన్నారు కానీ ఎవరు నటిస్తున్నారనే విషయం మీద అధికారికంగా ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు.


ఆ సంగతి అలా ఉంచితే ఆయన కొరటాల శివతో సినిమా పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ కన్నడలో చేసిన ఉగ్రం, పాన్ ఇండియా లెవెల్లో చేసిన కేజిఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ తో కలిసి చేయబోయే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నారు.


కేజీఎఫ్ సిరీస్ నిర్మించిన హోంబలే ఫిలిం సంస్థ సలార్ సినిమాను కూడా నిర్మిస్తోంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నీల్ సినిమా చేయబోతున్నాడు. ఇక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రెండు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారని, ఆ సినిమాలో హీరో ఆయనే విలన్ ఆయనే అని అంటున్నారు.


గతంలో కూడా మన తెలుగు హీరోలు ఇలా భిన్న ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు.  జై లవకుశ అనే సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్  ఉన్న పాత్ర పోషించారు. కానీ సినిమా క్లైమాక్స్ లో ఆయన పాత్ర మంచిగా మారిపోతుంది. అలాగే టెంపర్ లో కూడా ఆయన పాత్ర నెగిటివ్ షేడ్స్ తోనే ఉన్నట్లుగానే అనిపిస్తుంది, కానీ చివరికి హీరోగా మిగిలిపోతారు. ఈ ప్రయోగాలు ఎలాగో సక్సెస్ అయ్యాయి కాబట్టి ఎన్టీఆర్ మరోసారి ఆ మేరకు సిద్ధమవుతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది.


దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రాలేదు. ఒకవేళ నిజంగా ఆయన చేత విలన్ పాత్ర చేయించినా సరే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే అవకాశం ఉంది. నిజానికి గతంలో ఈ విలన్ పాత్ర కోసం కమల్ హాసన్ ను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అధికారికంగా ప్రకటించకుండా చివరి నిమిషంలో సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ వార్త నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు ఒక విందు అనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.
Also Read: Bigg Boss 6 Leaks: ఈ వారం పది మంది మీద ఎలిమినేషన్ కత్తి.. ఎవెరవరు నామినేట్ అయ్యారంటే?


Also Read: Allu Sirish Courage: పేరు మార్చుకుని మరీ సమంతకు పోటీకి దిగుతున్న అల్లు వారబ్బాయి.. కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook