Bigg Boss 6 Leaks: ఈ వారం పది మంది మీద ఎలిమినేషన్ కత్తి.. ఎవెరవరు నామినేట్ అయ్యారంటే?

Bigg Boss 6 Telugu 4th Week Nominations Leaked: ఎప్పటి లాగే బిగ్ బాస్ 6 సీజన్లో లీక్స్ బయటకు వస్తున్నాయి. ఈ వారం నామినేట్ అయిన వారి వివరాలిలా ఉన్నాయి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 26, 2022, 03:35 PM IST
Bigg Boss 6 Leaks: ఈ వారం పది మంది మీద ఎలిమినేషన్ కత్తి.. ఎవెరవరు నామినేట్ అయ్యారంటే?

Bigg Boss 6 Telugu 4th Week Nominations Leaked: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇప్పటికే విజయవంతంగా మూడు వారాల పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో నుంచి మూడు వారాల్లో ముగ్గురు హౌస్మేట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు కానీ రెండో వారంలో అభినయశ్రీ షానీ సాల్మన్ అనే ఇద్దరిని ఎలిమినేట్ చేసి షాకిచ్చారు.

ఇక మూడవ వారంలో నేహా చౌదరి ఎలిమినేట్ అయింది. ఇక నాలుగో వారం మొదటి రోజే నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఈ నామినేషన్ ప్రక్రియ ప్రకారం ఒక్కొక్క కంటెస్టెంట్ తనకు నచ్చని ఇద్దరి తల మీద టమాటో రసం పిండి ఎందుకు నామినేట్ చేస్తున్నామనే విషయాన్ని వివరించి చెప్పాలి. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.

గతంలో ఇనయా సుల్తానా శ్రీహాన్ మధ్య జరిగిన గొడవని మళ్లీ గుర్తు చేసుకుంటూ శ్రీహాన్ ఆమెను నామినేట్ చేస్తూ తాను ఎవరి పేరు చెప్పినా నిన్నే అనుకుంటున్నావని అంటూ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. తర్వాత రేవంత్ ను సుదీప నామినేట్ చేస్తూ ఇక్కడ ఎవరికి వారు ఇండివిడ్యువల్ గేమ్ ఆడారు అంటే ఆమెను కరెక్ట్ చేస్తూ రేవంత్ ఎవరికి వాళ్లు గ్రూప్ గా గేమ్ ఆడిన తర్వాత ఇప్పుడు ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు.

ఇక ఆ తర్వాత గీతూ ఇనయా సుల్తానా, చలాకీ చంటిలని నామినేట్ చేసింది. అయితే ఇనయా సుల్తానా, శ్రీహాన్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. నన్ను పెద్ద దానివి అని ఎలా అంటావు, నీకంటే లావుగా ఉంటే అలా ఎలా అంటావ్ అని సైజులో పెద్దగా కనపడితే ఇలాగే అంటావా ఇనయా రచ్చ మొదలు పెట్టింది. నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని శ్రీహాన్ చెప్పేందుకు ప్రయత్నం చేశాడు కానీ అవేవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

అక్కడ నేను చిన్నవాడిని అని నువ్వు అన్నావంటే నేను పెద్దదాన్ని అని అన్నట్టే కదా అని ఆమె కామెంట్ చేసింది. ఇక బిగ్ బాస్ లీక్స్ ప్రకారం అందుతున్న సమాచారం మేరకు ఈ వారం పది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ఆ పది మందిలో సుదీప, కీర్తి, గీతూ, రేవంత్, రాజశేఖర్, ఇనయా సుల్తానా, అర్జున్ కళ్యాణ్, సూర్య, ఆరోహి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. మిగతా ఎనిమిది మంది సభ్యులు నామినేషన్స్ లోకి రాలేదు. మరి చూడాలి ఈ వారం హౌస్ మేట్స్ లో ఎవరికి ఓట్లు వేసి ప్రేక్షకులు ఎవరిని సేవ్ చేయబోతున్నారో ? ఎవరిని బయటకి పంపబోతున్నారు అని.

Also Read: Mythri Movie Makers Conflict: మైత్రీ మూవీ మేకర్స్ లో ముసలం.. ముగ్గురిలో ఒకరు అవుట్..సొంత కుంపటి!

Also Read: Vijayasai Reddy on Chiranjeevi: చిరంజీవి గాడ్ ఫాదర్ పై విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్..ఇప్పుడెందుకు చెప్మా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News