Allu Sirish Courage: పేరు మార్చుకుని మరీ సమంతకు పోటీకి దిగుతున్న అల్లు వారబ్బాయి.. కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా?

Allu Sirish Prema Kadanta Movie Title Changed as Urvasivo Rakshasivo: అల్లు శిరీష్ హీరోగా రూపొందిన ప్రేమ కాదంట మూవీ టైటిల్ ను ఊర్వశివో రాక్షసివోకి మార్చారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 26, 2022, 06:21 PM IST
Allu Sirish Courage: పేరు మార్చుకుని మరీ సమంతకు పోటీకి దిగుతున్న అల్లు వారబ్బాయి.. కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా?

Allu Sirish Prema Kadanta Movie Title Changed as Urvasivo Rakshasivo: గౌరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్. ఆ తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు. చివరిగా సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో ఆయన ఏబీసీడీ అనే ఒక మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఆ సినిమా 2019లో రిలీజ్ అయినా అది పెద్దగా ఉపయోగ పడలేదు.

అయితే అప్పట్లోనే ఆయన మరో సినిమా కూడా అనౌన్స్ చేశాడు. ఆయన అను ఇమ్మానియేల్ తో కలిసి ఒక సినిమా చేశాడు. దానికి ప్రేమ కాదంట అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమా 2021 డిసెంబర్లోనే పూర్తయిందని, ప్రమోషన్స్ ప్రారంభించి ఫిబ్రవరి 2022లో విడుదల చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

తాజాగా దానికి సంబంధించిన అధికారిక క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోం.  సెప్టెంబర్ 29వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా యూనిట్ ప్రకటించింది. అయితే ప్రేమ కాదంట అనే టైటిల్ కాకుండా ఈ సినిమాకు ఊర్వశివో రాక్షసివో అనే టైటిల్ తో సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం అభిమానులకు కాస్త షాకింగ్ అనిపించింది. ఎందుకంటే గతంలో ప్రేమ కాదంట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు అల్లు శిరీష్ వస్తాడని భావిస్తే ఇప్పుడు ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తుండగా శశి రాకేష్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. శశి రాకేష్ గతంలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రూపొందిన విజేత సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. జనవరి లేదా ఫిబ్రవరి నెలలోనే సినిమా విడుదలకు రంగం సిద్ధం చేశారు. కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. అప్పట్లో అల్లు శిరీష్ కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తామని పేర్కొన్నారు.

తమకి స్లాట్ దొరికితే రిలీజ్ గురించి ప్రకటిస్తామని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఇప్పటికి ఆ స్లాట్ దొరికిందని చెప్పొచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నవంబర్ 4వ తేదీన సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమాని కూడా డైరెక్టర్ గుణశేఖర్, దిల్ రాజు కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సమంత సినిమాతో అల్లు శిరీష్ సినిమా ఢీకొనడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

Also Read:  Bigg Boss 6 Leaks: ఈ వారం పది మంది మీద ఎలిమినేషన్ కత్తి.. ఎవెరవరు నామినేట్ అయ్యారంటే?

Also Read: Mythri Movie Makers Conflict: మైత్రీ మూవీ మేకర్స్ లో ముసలం.. ముగ్గురిలో ఒకరు అవుట్..సొంత కుంపటి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x