Jr NTR: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌'(RRR) మూవీతో బిజీగా ఉన్న ఎన్టీఆర్..తర్వాత కొరటాల శివ(Koratala Shiva), ప్రశాంత్ నీల్(Prashant Neil) దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. డిసెంబర్‌లో కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు తారక్‌(Jr NTR) ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం.  ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చిత్రాన్ని కూడా ప్రారంభిస్తాడట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఎన్టీఆర్‌ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు ఎన్టీఆర్‌ బాలీవుడ్‌(bollywood) బడా దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీ-టౌన్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌ సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ కాంబోలో ఓ సినిమా రాబోతుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు.


Also read: RRR movie pre-release event: దుబాయ్‌లో ఆర్ఆర్ఆర్ ప్రి-రిలీజ్ ఈవెంట్ ?


మరోసారి వీరి కాంబినేషన్‌ తెరపైకి వచ్చింది. సంజయ్‌ లీలా భన్సాలీ, ఎన్టీఆర్‌ కోసం పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్‌(Periodically) బ్యాక్‌డ్రాప్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్‌ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేగాక దీనికి '‘జై బావ్ రే’' అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. అన్నీ కుదిరి భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్‌కు పండగే. 


సంజయ్.. ప్రస్తుతం 'గంగు భాయ్ కథియావాడి' సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో అలియాభట్(Aliabhat) ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తోనే సంజయ్ మరో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో ఎన్టీఆర్‌తో క‌లిసి పని చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది. చూడాలి మ‌రి ఇందులో ఎంత నిజ‌ముందో వేచి చూడాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook