Jr NTR Unhappy over HCA Incident: హాలీవుడ్లో గత ఏడాది ఎన్నో సినిమాలు విడుదలైన బెస్ట్ యాక్షన్ ఫిలిం గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ ని ప్రకటించింది.  ఈ అవార్డుని వాస్తవానికి అయితే డివివి దానయ్య అందుకోవాలి కానీ ఆయన రాలేదు కాబట్టి ఆయన స్థానంలో అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్, రాజమౌళి అందుకున్నారు. అయితే ఈ ఘనత రామ్ చరణ్ కు ఒక్కడికే దక్కినట్టుగా మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్ లో మెగా హీరోలు పవన్ కళ్యాణ్ సైతం రామ్ చరణ్ కు అభినందనలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తూ రాజమౌళిని టార్గెట్ చేస్తూ రామ్ చరణ్ ని టార్గెట్ చేస్తూ కావాలని మా హీరోని తొక్కేస్తున్నారు అంటూ కామెంట్లు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ విషయం మీద హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కూడా స్పందించింది. తాము ఎన్టీఆర్ ని పిలిచిన మాట వాస్తవమే కానీ ఆయన ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడని ఆయనకు అందించాల్సిన అవార్డులు అందిస్తామని క్లారిటీ ఇచ్చింది.. అయితే ఇది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తనంతట తానుగా ఇచ్చిన క్లారిఫికేషన్ కాదని రాజమౌళి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టీంతో మాట్లాడి ఈ క్లారిటీ ఇప్పించారు అనే ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఎన్టీఆర్ అభిమానులు కాదు ఎన్టీఆర్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ టీం మీద అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


నిజానికి గత ఏడాది నుంచి జరుగుతున్న పరిణామాలను మనం పరిశీలిస్తే ఇండియాలో రామ్ చరణ్ కి ఈ సినిమా తర్వాత క్రేజ్ ఎక్కువగా పెరిగిపోయింది. అదే బయట కంట్రీస్ లో అంటే అమెరికా సహా ఇతర దేశాల్లో ఎన్టీఆర్కి క్రేజ్ పెరిగిన పరిస్థితి కనిపించింది. రాజమౌళి కూడా ఎన్టీఆర్ కే ఎక్కువ కవరేజ్ ఇప్పిస్తున్నాడని అప్పట్లో రామ్ చరణ్ అభిమానులు కూడా ఇదే విధమైన కామెంట్లు చేశారు. అయితే ఆస్కార్ క్యాంపైన్ జరుగుతున్న సమయంలో కూడా ఎన్టీఆర్ మీదనే అక్కడి మీడియా అంతా ఫోకస్ పెట్టింది. దీని మీద రామ్ చరణ్ అభిమానులు కాస్త సహనం కూడా వ్యక్తం చేశారు. అంతా పైడ్ క్యాంపైన్ నడుస్తుందని వారు అప్పట్లో కామెంట్లు చేశారు.


అంతేకాక వెరైటీ అనే ఒక మ్యాగజైన్ కూడా ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు అందుకునేందుకు అర్హుడు అంటూ ఒక జాబితాలో ప్రచురించగా తర్వాత కొన్ని రోజులకు రామ్ చరణ్ పేరును కూడా ప్రచురించేలా మేనేజ్ చేయగలిగారు. అయితే ఎన్టీఆర్ ప్రమేయం లేకుండానే ఎన్టీఆర్ పేరు రావడంతో ఎన్టీఆర్ కూడా తాను ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందని భావించారట. కానీ ఇక్కడ అలాంటి విషయాలు జరగలేదు కాబట్టి ఎన్టీఆర్ కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారని అంటున్నారు. దానికి తోడు దిగ్గజ దర్శకులు అని భావిస్తున్న వారు సైతం ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా రాంచరణ్ ప్రస్తావన తీసుకు రావడంతో ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ కి రాకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.


అదే సమయంలో రామ్ చరణ్ మాత్రం ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లడం కాదు అన్ని తానై వ్యవహరిస్తున్న నేపథ్యంలో హాలీవుడ్ మీడియా కూడా రాంచరణ్ ఎత్తేస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇది కరెక్ట్ గా లేదని కావాలని తమ హీరోని పిలవలేదని ప్రచారం తెరమీదకు తెచ్చారు. వెంటనే రాజమౌళి రంగంలోకి దిగి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ చేత క్లారిటీ ఇప్పించాలని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా సరే ఆస్కార్ అవార్డులు వేడుకలో కనిపించాలి కాబట్టి మార్చి ఆరో తేదీ ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లబోతున్నారు. ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 14వ తేదీన జరగనున్న నేపథ్యంలో అవార్డులు వేడుక ముగించుకుని తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు.


Also Read: Naga Shaurya Fight: లవర్ ను రోడ్డుపై కొట్టిన యువకుడు.. రచ్చ చేసిన నాగశౌర్య!


Also Read: Genelia D'souza Kids Doing Namaste: ఇదే కదా సంస్కారం అంటే.. ఫోటోగ్రాఫర్లకు జెనీలియా పిల్లలు నమస్కారం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి