Naga Shaurya Fight: లవర్ ను రోడ్డుపై కొట్టిన యువకుడు.. రచ్చ చేసిన నాగశౌర్య!

Naga Shaurya Fight on Road: లవర్ ను రోడ్డుపై కొట్టిన యువకుడితో హీరో నాగశౌర్య గొడవపడ్డాడు, లవర్ అయితే మాత్రం అలా రోడ్డు మీద కొట్టడం కరెక్ట్ కాదని ఆయన కామెంట్ చేశారు, ప్రస్తుతానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 28, 2023, 04:44 PM IST
Naga Shaurya Fight: లవర్ ను రోడ్డుపై కొట్టిన యువకుడు.. రచ్చ చేసిన నాగశౌర్య!

Naga Shaurya Created Ruckus on Road: ఈ మధ్యనే నాగశౌర్య వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న సినిమాలు బోల్తా కొడుతున్నా ఒక్క సినిమా హిట్ కొట్టకపోతామా అని ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళుతున్నాడు. చివరిగా ఆయన 2021 లో వరుడు కావలెను లక్ష్య అనే సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు కానీ ఆ సినిమాలో కలిసి రాలేదు. తరువాత చేసిన కృష్ణా వ్రిద విహారి సినిమా కూడా భారీ అంచనాలతో విడుదలైన ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.  

ఇక ప్రస్తుతానికి నాగశౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాలో సంజయ్ పిసాపాటి అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహలు గుసగుసలాడే సినిమాతో నాగ శౌర్యని టాలీవుడ్ కి పరిచయం చేసిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా నాగశౌర్య వార్తల్లోకి వచ్చాడు. నాగశౌర్య ఒక యువకుడితో గొడవ పడుతున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సదరు వీడియోలో నాగశౌర్య ఆ యువకుడిని అమ్మాయికి సారీ చెప్పమని అడుగుతున్నట్లు కనిపిస్తే అతను మాత్రం ఆమె నా లవర్ ఆమె నా లవర్ అంటూ అనడం కనిపిస్తోంది. ఇక సదరు వ్యక్తి తన ప్రేమికురాలు మీద చేయి చేసుకోవడం చూసి నాగశౌర్య తట్టుకోలేక ఆడపిల్లని అలా చేసే ధైర్యం ఉందా నీకు? ఆమెకు సారి చెప్పు అంటూ లవర్ మీద విరుచుకు పడినట్లుగా తెలుస్తోంది.

దానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అసలు ఈ వివాదానికి కారణం ఏమిటి? నాగశౌర్యకు కూడా ఈ వివాదంలో ఏమైనా భాగం ఉందా? లేక బయట ఎవరో కొట్టుకుంటూ ఉంటే వెళ్లి నాగశౌర్య ఆమెకు సారీ చెప్పమని అడుగుతున్నాడా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: HCA Clarity on Jr NTR issue: ఎన్టీఆర్ పై కుట్ర..పిలిచాం కానీ రాలేదంటూ హెచ్సీఏ షాకింగ్ ట్వీట్!

Also Read: Yasaswi Kondepudi Sister: యశస్వి ఇంట పెళ్లి భాజాలు.. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న సంకీర్తన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 
 

Trending News