Genelia D'souza Kids Doing Namaste: ఇదే కదా సంస్కారం అంటే.. ఫోటోగ్రాఫర్లకు జెనీలియా పిల్లలు నమస్కారం!

Genelia D'souza Children Greatness: ఎయిర్పోర్టులో సాధారణంగానే వీడియో గ్రాఫర్లు, వీడియోలు ఫోటోలు తీయడానికి రెడీగా ఉంటారు వారికి జెనీలియా ఇద్దరు కుమారులు ఫోటోగ్రాఫర్లకు నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 28, 2023, 04:53 PM IST
Genelia D'souza Kids Doing Namaste: ఇదే కదా సంస్కారం అంటే.. ఫోటోగ్రాఫర్లకు జెనీలియా పిల్లలు నమస్కారం!

Genelia D'souza Children Greatness: బాయ్స్ సినిమాతో తెలుగువారికి పరిచయమైన జెనీలియా డిసౌజా సత్యం సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గర అయింది. తర్వాత సాంబ, సై, నా అల్లుడు, హ్యాపీ, రామ్, బొమ్మరిల్లు వంటి సినిమాలతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె తెలుగు, తమిళంలో సినిమాలు చేయడం కంటే ముందే హిందీలో తుజే మేరీ కసం అనే సినిమాలో నటించింది. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన నువ్వే కావాలి అనే సినిమాకు రీమేక్. అయితే నిజానికి నువ్వే కావాలి అనే సినిమానే ఒక మలయాళ సినిమాకి రీమేక్ గా రూపొందింది.

అంటే టెక్నికల్గా తుజే మేరీ కసం సినిమా మలయాళ నీరం అనే సినిమాకి రీమేక్ అని చెప్పుకోవాలి. నువ్వే కావాలి దర్శకుడు కే విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తుజే మేరీ కసం సినిమాలో జెనీలియా అంజలి అనే పాత్రలో నటించింది. ఈ సినిమాను రామోజీ రావు నిర్మించగా సూపర్ హిట్ అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించిన రితీష్ దేశ్ముఖ్ తోనే జెనీలియా ప్రేమలో పడి తర్వాత వివాహం కూడా చేసుకుంది. వారిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా జన్మించారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Instant Bollywood (@instantbollywood)

తాజాగా జెనీలియా అలాగే తన భర్త రితీష్ దేశ్ముఖ్ తో కలిసి తన ఇద్దరు కుమారులతో ఎక్కడి నుంచో వస్తు ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆ ఎయిర్పోర్టులో సాధారణంగానే వీడియో గ్రాఫర్లు, వీడియోలు ఫోటోలు తీయడానికి రెడీగా ఉంటారు కదా. అలాంటి సందర్భంలో జెనీలియా ఇద్దరు కుమారులు ఫోటోగ్రాఫర్లకు నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అయింది. దీంతో వారి వయసు కంటే సంస్కారమే పెద్దగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక కుమారులు ఇద్దరూ వారికి నమస్కారం చేసిన తర్వాత జెనీలియా సహా రితీష్ దేశ్ముఖ్ కూడా వారికి నమస్కారం చేస్తూ ముందుకు సాగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిల్లలు ఇద్దరు బలే సంస్కారవంతులని చిన్నప్పటి నుంచే ఇలాంటి పద్ధతులు అందరి పెద్దలు నేర్పిస్తే పిల్లలందరూ పెద్ద వారిని గౌరవిస్తారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక జెనీలియా టాలీవుడ్ రి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి రెడ్డి హీరోగా రుపొందుతున్న తెలుగు కన్నడ సినిమాలో ఆమె గాలి కిరీటిరెడ్డి అక్క పాత్రలో నటిస్తున్నట్లు గా చెబుతున్నారు.

Also Read: HCA Clarity on Jr NTR issue: ఎన్టీఆర్ పై కుట్ర..పిలిచాం కానీ రాలేదంటూ హెచ్సీఏ షాకింగ్ ట్వీట్!

Also Read: Yasaswi Kondepudi Sister: యశస్వి ఇంట పెళ్లి భాజాలు.. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న సంకీర్తన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 
 

Trending News