Jr NTR New year vacation: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజాగా తారక్ షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. మనోడు ఎక్కడికి వెళ్లాడనేది కదా మీ డౌట్. ఎన్టీఆర్ తన సతీమణి పిల్లలతో కలిసి జపాన్ కు వెళ్లాడట. అక్కడే న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోనున్నాడట. ఎయిర్‌పోర్టులో తారక్‌ తన ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  యంగ్ టైగర్ వీలు దొరికినప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. అందుకే విరామం దొరికినప్పుడల్లా భార్య, పిల్లలతో కలిసి ఫారిన్ చెక్కేస్తాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూనియర్ ఎన్టీఆర్ నయా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో సైఫ్ బైర అనే పాత్రలో కనిపించబోతున్నాడు.  ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ  తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుంది. దేవర తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. 



అయితే దేవర టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. టీజర్ కాకపోయినా గ్లింప్స్ అయినా వదలాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.  త్వరలోనే టీజర్ రాబోతుందని కళ్యాణ్ రామ్ ఇదివరకే అనౌన్స్ చేశారు. అయితే గ్లింప్స్ లేదా టీజర్ సంక్రాంతి లోపు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే తారక్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. 


Also Read: Alia Bhatt Daughter: రణ్​బీర్, ఆలియాల గారాల పట్టి ఎంత ముద్దుగా ఉందో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి