భరత్ బహిరంగ సభ పేరిట శనివారం రాత్రి ఎల్టీ స్టేడియంలో జరిగిన భరత్ అనే నేను సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా హాజరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ వేదికపై నుంచి అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. " మీరు ( అభిమానులు అందరూ అతడిని ప్రిన్స్ అని లేక సూపర్ స్టార్ అని పిలుచుకుంటుంటారు. కానీ తనకు మాత్రం అతడిని ఎప్పుడూ మహేష్ అన్న అనే పిలవడమే అలవాటు. మొదటి నుంచి అలాగే పిలుస్తున్నాను కూడా. అందుకే తనకు సంబంధించినంత వరకు తమ ఇద్దరి కలయిక కొత్తగా ఏమీ అనిపించడం లేదు" అని అన్నాడు తారక్. మహేష్ అన్న ఒక పెద్ద కమెర్షియల్ హీరో అయ్యుండి కూడా ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవ్వరూ చేయలేదు. సినిమా హిట్ అవుతుందా లేదా అనే ప్రయోగంతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడం మహేష్ అన్నకు మాత్రమే చెల్లింది. అందుకే ఆయన అంటే తమ అందరికీ ఇనిస్పిరేషన్ అని చెబుతూ మహేష్ బాబుని ఆకాశానికెత్తేశాడు జూనియర్ ఎన్టీఆర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భరత్ అనే నేను సినిమా దర్శకుడైన కొరటాల శివనే తెరకెక్కించిన జనతా గ్యారేజ్ సినిమా ప్రస్తావన తీసుకొస్తూ.. అందులో రాజీవ్ కనకాల పాత్రను ఉద్దేశిస్తూ తాను చెప్పిన ఓ డైలాగ్‌ని తారక్ గుర్తు చేసుకున్నాడు. " ఆ సినిమాలోని అరుదైన మొక్క డైలాగ్ మాదిరిగానే మహేష్ అన్న కూడా అరుదైన మొక్క. ఆయన్ని అలాగే ఉండనిద్దాం " అని యంగ్ టైగర్ చెప్పిన డైలాగ్స్‌కి వేదిక కిందున్న అభిమానుల నుంచి భారీ స్పందన కనిపించింది. భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తారక్ ఇంకా ఎవరెవరి గురించి, ఏమేం అభిప్రాయాలు చెప్పాడో ఆయన మాటల్లోనే మీరే వినండి.