Junior Ntr: భార్యకు `బృందావనం` గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆరున్నర ఎకరాల్లో అద్భుతంగా నిర్మాణం!
Junior Ntr Gifts Farmhouse to Wife Pranathi: ఆరున్నర ఎకరాల్లో అద్భుతమైన ఫాం హౌస్ నిర్మించిన ఎన్టీఆర్ దాన్ని తన భార్య పుట్టినరోజు సందర్భంగా దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు.
Junior Ntr Gifts Farmhouse to Wife Pranathi: జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా తన భార్యకు ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత ఏడాది హైదరాబాద్ సిటీ శివార్లలో ఎన్టీఆర్ 6.30 ఎకరాల భూమి కొన్నట్లుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఎన్టీఆర్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లి రిజిస్టర్ చేయించుకుంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే ఆరున్నర ఎకరాల భూమిలో ఆయన ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ నిర్మించారని మిగిలిన ప్రాంతంలో కూరగాయల మొక్కలు, పూల మొక్కలతో ఒక తోటలాగా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇక ఈ ఫామ్ హౌస్ కి అయిన బృందావనం అనే పేరు పెట్టుకున్నారని దాన్ని తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమ అన్న ఏర్పాటు చేసిన బృందావనం ఫోటోలు బయటకు వస్తే బాగుండు అని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయం మీద కాస్త సంధిగ్దం కోనసాగుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు పెట్టేసుకున్నారు.
Also Read: Rama Rao On Duty: మాస్ ట్రైలర్ తో ట్రీట్ ఇచ్చిన రవితేజ.. 'రామా ఆన్ డ్యూటీ' అంటూ రంగంలోకి!
Also Read Liger: క్రాస్ బ్రీడ్ లైగర్ వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్ స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook