Rama Rao On Duty: మాస్ ట్రైలర్ తో ట్రీట్ ఇచ్చిన రవితేజ.. 'రామా ఆన్ డ్యూటీ' అంటూ రంగంలోకి!

Rama Rao On Duty Trailer: జులై 29న విడుదల కానున్న రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 08:04 PM IST
  • రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ
  • రిలీజ్ దగ్గర పడుతున్న నేపధ్యంలో ట్రైలర్ రిలీజ్
  • ఆకట్టుకుంటున్న ట్రైలర్
Rama Rao On Duty: మాస్ ట్రైలర్ తో ట్రీట్ ఇచ్చిన రవితేజ.. 'రామా ఆన్ డ్యూటీ' అంటూ రంగంలోకి!

Rama Rao On Duty Trailer: చాలా కాలం పాటు సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన రవితేజ క్రాక్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసాడు. అయితే ఆ సినిమా తర్వాత చేసిన ఆయన ఖిలాడీ అనే సినిమా చేశాడు. రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మాత్రం రవితేజ ఊహించిన మేర అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వరుస సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ ఖరారు రావడంతో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ పార్క్ హోటల్లో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్లో విడుదల చేశారు. రవితేజతో కలిసి పని చేస్తున్న దర్శకులు 8 మంది ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

తనకు ఉన్న మాస్‌ అభిమానులను మెప్పించేలా రవితేజ నటన, డైలాగ్స్‌తో ఎప్పటిలాగే అదరగొట్టారు. 1995 నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ఒక సబ్ కలెక్టర్ గా పని చేస్తూ ఉండగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ట్రయిలర్ కట్ చేశారు. సినిమాలో నటిస్తున్న మిగతా వారి పాత్రలను కూడా చూచాయగా చూపించారు.

ఇక ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ శరత్‌ మండవ తెరకెక్కిస్తుండగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ మీద   సుధాకర్‌  చెరుకూరి నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి ఒక మంచి రోల్ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా జులై 29న విడుదల కానున్న క్రమంలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇక ఈ సినిమాకు సామ్‌ సిఎస్‌ స్వరాలందిస్తున్నారు.

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News