Junior NTR House: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర గందరగోళం నెలకొంది. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. పరిస్థితిని ఇంటి సెక్యూరిటీ గార్డులు అదుపు చేయలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ బయటకు రావాలని నినాదాలు చేశారు. ఈసమయంలో దివంగత నటుడు కృష్ణం రాజుకు నివాళులర్పించేందుకు ఆయన బయటకు వచ్చారు. కారులో వెళ్తుండగా అభిమానులంతా క్యూ కట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు హంగామా చేశారు. ఇందులో చంటి బిడ్డలతో ఉన్న మహిళలు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్థానిక పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి సెక్యూరిటీ గార్డులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు..అభిమానులను చెదరగొట్టారు. దీంతో ఫ్యాన్స్ అంతా పరుగులు తీశారు. ఇందులో కొందరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అభిమానులంతా శాంతంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.


సినీ నటుడు కృష్ణం రాజు చనిపోవడంతో తెలుగు సినీ రంగం తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఈఉదయం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రెబల్ స్టార్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన ఇంటి వద్ద పార్థివదేహానికి పలువురు నివాళులర్పిస్తున్నారు. కృష్ణం రాజు కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతున్నారు. ఈసందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. 


కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపేందుకు సినీ ప్రముఖులంతా బయటకు వస్తుండటంతో ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. వారిని చూసేందుకు క్యూకడుతున్నారు. అభిమాన నటులను చూడాలని ప్రయత్నిస్తున్నారు. 


Also read:Krishnam Raju Death Live Updates: కృష్ణంరాజు కన్నుమూత.. రేపు అంత్యక్రియలు -లైవ్ అప్డేట్స్ 


Also read:CM Kcr: జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారా..? కుమారస్వామితో మంతనాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి