Hermes Shoes: జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ యంగ్ టైగర్. నటనతో బ్రాండ్ అంబాసిడర్ అయిన తాతయ్య నుంచి ఆ లక్షణాల్ని అందిపుచ్చుకున్నాడు. కేవలం నటనలోనే కాదు..ధరించే ప్రతి వస్తువూ బ్రాండెడే..షూస్ ఎంతో తెలుసా మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నటనలో ఎన్టీఆర్ ( NTR ) ఓ బ్రాండ్. సీనియర్ ఎన్టీఆర్ నుంచి పోలికల్ని..నటను అందిపుచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR ). జూనియర్ అభిమానులైతే తమ హీరో ఏం చేసినా బ్రాండే అంటారు. ధరించే ప్రతీది బ్రాండెడ్ వాడటమే దీనికి కారణం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ప్రతి అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. 


ఇటీవల క్రిస్మస్ ( Christmas ) సందర్బంగా తన ఇద్దరు వారసుల ఫోటోలు షేర్ చేయగానే వైరల్ అయిపోయాయి. రెండ్రోజుల పాటు అదే ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్..రాజమౌళి ( Rajamouli ) షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇవ్వడంతో డిజైన్స్ , స్టైల్‌పై దృష్టి పెట్టాడు. 


ఇటీవల రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్  చాలా వైరల్ అయింది. ఆ వాచ్ విలువ దాదాపు 30 లక్షల రూపాయలు. మహేశ్ బాబు ( Mahesh babu ), అల్లు అర్జున్ ( Allu Arjun ) వంటి హీరోలు కూడా లక్షలు వెచ్చించి..డ్రెసెస్, వాచెస్ కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న షూస్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ బ్రాండ్ అలాంటిది. చాలా కాస్ట్ లీ బ్రాండ్ అది.  ఆ బ్రాండ్ పేరు HERMES. ఇవి కచ్చితంగా స్పెషల్ షూస్ కావడంతో అభిమానులు వెంటనే గూగుల్‌లో వెతికారు. ఆ షూస్ అక్షరాలా 75 వేలకు పైనే అని గూగుల్ చెప్పడంతో అభిమానులు అవాక్కయ్యారట. అంతే..ఇంకేముంది..ఇదీ మా యంగ్ టైగర్ రేంజ్ అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. 


Also read: Tollywood: మహేశ్ నాకు బిగ్ బ్రదర్: రణ్‌వీర్ సింగ్