Tollywood: మహేశ్ నాకు బిగ్ బ్రదర్: రణ్‌వీర్ సింగ్

టాలీవుడ్‌లో మహేశ్ బాబు..బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ ఇద్దరూ కలిస్తే..అదే జరిగింది. ఆ పిక్ వైరల్‌గా మారింది.

Last Updated : Dec 26, 2020, 05:46 PM IST
Tollywood: మహేశ్ నాకు బిగ్ బ్రదర్: రణ్‌వీర్ సింగ్

టాలీవుడ్‌లో మహేశ్ బాబు..బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ ఇద్దరూ కలిస్తే..అదే జరిగింది. ఆ పిక్ వైరల్‌గా మారింది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ( Telugu Cinema industry ) లో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న మహేశ్ బాబు ( Mahesh babu ), బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ ( Ranveer singh )‌లకు ఉన్న చాలా క్రేజ్ ఉంది. ఓ వైపు సినిమాలు మరోవైపు యాడ్స్‌తో ఈ ఇద్దరూ బిజీగా ఉంటుంటారు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిస్తే ఏం జరుగుతుందో మరి.. నిజమే అదే జరిగింది. ఓ యాడ్ షూట్‌లో భాగంగా కలిసిన ఈ ఇద్దరి ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. 

ఈ ఇద్దరూ తెలుగు, హిందీ భాషల్లో థమ్స్‌అప్ యాడ్ ( Thumsup add ) చేస్తున్నారు. తెలుగులో మహేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయితే..హిందీలో రణ్‌వీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరితో కలిపి ఓ యాక్షన్ యాడ్ షూట్ చేశారు. ఆ యాడ్ ఏమిటనేదానిపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. ఆ ఫోటోల్ని ఇద్దరు హీరోలు తమ తమ ట్విట్టర్ అక్కౌంట్లలో షేర్ చేశారు. మీతో కలిసి పని చేయడం గొప్ప అనుభూతినిచ్చిందని మహేశ్ ట్వీట్ చేయగా..తనకు కలిసిన వారిలో ఫైనెస్ట్ జెంటిల్మెన్ మహేశ్ అని ...బిగ్ బ్రదర్ మహేశ్‌ ( Big brother mahesh babu )పై ఎప్పుడూ గౌరవం, ప్రేమ ఉంటాయని రణ్ వీర్ ట్వీట్ చేశారు.

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇరువురు హీరోల అభిమానులు ఫిదా అవుతున్నారు. పిక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

Also read: Christmas tree tattoo: వి సినిమాతో పోయిన క్రేజ్..ఆ టాటూతో వచ్చేసిందట

Trending News