Justin Bieber india tour : అక్టోబర్‌లో జస్టిన్ బీబర్ భారత్ టూర్.. టికెట్లు కావాలంటే..
Justin Bieber india tour : అక్టోబర్‌లో భారత్‌లో భారీ మ్యూజికల్ లైవ్ బ్లాస్ట్ కోసం సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే ప్రముఖ కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్‌కు వస్తున్నాడు.
Justin Bieber india tour : ప్రముఖ కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ అక్టోబర్ నెలలో భారత్‌కు వస్తున్నాడు. దిల్లీలో లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నాడు బీబర్. 'బేబీ' సాంగ్‌తో హిట్ అందించిన జస్టిన్.. 'జస్టిస్ వరల్డ్ టూర్'లో భాగంగా అక్టోబర్ 18న న్యూదిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. AEG ప్రెజెంట్స్, భారత ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ ప్లాట్‌ఫాం BookMyShow ఈ ఈవెంట్ కో-ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాయి.
జస్టిస్ వరల్డ్ టూర్ మే 2022 నుండి మార్చి 2023 వరకు 30 దేశాల్లో జరగనుంది. దాదాపు 125 కంటే ఎక్కువ షోలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌లో దిల్లీలో జరగనున్న ప్రదర్శనతో కలిపితే భారతదేశానికి జస్టిన్ రావటం ఇది రెండో సారి. 2017లో, జస్టిన్ తన పర్పస్ వరల్డ్ టూర్‌లో భాగంగా ముంబైలో ప్రదర్శన ఇచ్చాడు. ఈ ఈవెంట్‌లో దాదాపు 40,000 మంది జస్టిన్ అభిమానులు ఓలలాడారు.
2009లో మై వరల్డ్ ఆల్బమ్‌తో ఆరంగేట్రం చేసి టీనేజ్‌లోనే యూత్ ఐకాన్‌గా మారాడు బీబర్. 2010లో మై వరల్డ్ 2.0తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. బేబీ సాంగ్‌తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఘనత బీబర్‌దే. అతి చిన్న వయసులోనే సంగీత రంగంలో తనదైన ముద్ర వేశాడు బీబర్.
2015లో వేర్ ఆర్ యు అనే ఈడీఎమ్ ద్వారా బీబర్.. బెస్ట్ డాన్స్ కమ్ ఎలక్ట్రానిక్ రీడింగ్‌కు గ్రామీ అవార్డు సొంతం చేసుకున్నాడు. అంతే కాక తన పర్పస్ ఆల్బమ్‌లోని లవ్ యువర్ సెల్ఫ్, సారీ, వాట్ డు యూ మీన్? తదితర పాటలు యూకే సింగిల్స్ చార్ట్‌లో టాప్ త్రీగా నిలిచాయి.
2016-17 మధ్య బీబర్ సాంగ్స్ ఐయామ్ ద వన్, డిస్‌పాసిటో రీమిక్స్ వెర్షన్ యుఎస్ బిల్‌బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో వరుసగా కొన్ని వారాల పాటు టాప్‌లో నిలిచి రికార్డులు సాధించింది. 2020లో వచ్చిన ఆర్ అండ్ బీ నేతృత్వంలో వచ్చిన ఐదో ఆల్బమ్ చేంజెస్‌తో యూకే, యూఎస్‌లలో నంబర్ వన్ గా నిలిచింది.
అరియానా గ్రాండేతో కలిసి చేసిన స్టక్ విత్ యు డ్యూయెట్ సైతం బిల్‌బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచింది. గతేడాది తిరిగి పాప్ మ్యూజిక్ ఆల్బమ్ "జస్టిస్"తో ముందుకొచ్చాడు బీబర్. ఈ ఆల్బమ్‌లోని పీచెస్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను, ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న బీబర్ ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు. 2011లో అమెరికన్ న్యూస్ మ్యాగజిన్ టైమ్.. బీబర్‌ను ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన టాప్ 100 మందిలో ఒకడిగా పేర్కొంది. ఫోర్బ్స్ వరుసగా 2011, 2012, 2013లో అత్యంత శక్తిమంతమైన సెలెబ్రిటీల జాబితాలో బీబర్ ఒకరని పేర్కొంది.
Also Read - Shalini Pandey Photos: క్లీవేజ్ షోతో అదరగొడుతున్న 'అర్జున్ రెడ్డి' భామ!
Also Read - SVP Collections: బాక్సాఫీస్‌పై 'సర్కారు వారి పాట' దండయాత్ర.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook