SVP Collections: బాక్సాఫీస్‌పై 'సర్కారు వారి పాట' దండయాత్ర.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డు!

Sarkaru Vaari Paata movie Day 12 collections. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 103 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన 'సర్కారు వారి పాట' సినిమా.. తాజాగా రూ. 200 కోట్ల గ్రాస్‌కు చేరుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 01:51 PM IST
  • బాక్సాఫీస్‌పై మహేశ్‌ బాబు దండయాత్ర
  • ఎస్‌వీపీ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?
  • తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డు
SVP Collections: బాక్సాఫీస్‌పై 'సర్కారు వారి పాట' దండయాత్ర.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డు!

Sarkaru Vaari Paata movie collects 200 crores gross worldwide in 12 days: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు హీరోగా వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. మహేశ్ బాబుకి సరైన కంటెంట్ పడితే.. బాక్సాఫీస్ వద్ద రీసౌండింగ్ రిజల్ట్స్ ఎలా ఉంటుందో ఎస్‌వీపీ మరోసారి నిరూపించింది. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ రావడంతో.. రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. మహేశ్ స్వాగ్‌ను వెండితెరపై ఆస్వాదించేందుకు సినీ ప్రియులు ఇప్పటికీ థియేటర్లకు బారులు తీరుతున్నారు. దాంతో ఎస్‌వీపీ చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 103 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన 'సర్కారు వారి పాట' సినిమా.. తాజాగా రూ. 200 కోట్ల గ్రాస్‌కు చేరుకుంది. 12 రోజులో ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకే పైగా గ్రాస్‌ కలెక్ట్ చేసినట్టు మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 'వేసవి సూపర్‌స్టార్ స్వాగ్ కొనసాగుతోంది. 12 రోజులో ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్. వేసవి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్' అని కాప్షన్ ఇచ్చింది. 2022 తెలుగు సినీ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ అని కూడా పేర్కొంది. రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి రీజనల్ సినిమాగా ఎస్‌వీపీ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

సెకండ్ వీకెండ్ రన్ తర్వాత టాలీవుడ్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన రీజనల్ సినిమాగా కూడా ఎస్‌వీపీ చరిత్రపుటలకెక్కింది. మహేశ్ బాబు గత చిత్రాలు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు రూ. 100 కోట్లకు పైగానే షేర్ కలెక్ట్ చేశాయి. ఎప్పుడో సర్కారు వారి పాట కూడా ఆ మార్క్‌ని దాటేసింది. దాంతో తెలుగులో నాలుగు రూ. 100 కోట్ల షేర్ సినిమాలు కలిగిన హీరోగా సూపర్ స్టార్ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. కలెక్షన్స్ చూస్తుంటే మహేశ్ బాబు కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్ గ్రాసర్‌గా నిలవబోతున్నట్టు కనిపిస్తోంది. 

ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్‌వీపీ సినిమాలో మహేశ్‌ బాబు సరసన కీర్తి సురేష్ నటించారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ చాలా స్టైలీష్‌గా కనిపించడంతో పాటు కామెడీ, యాక్షన్‌తో అదరగొట్టారు. మహేష్, కీర్తి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వెన్నెల కిశోర్ మరోసారి తన టైమింగ్‌తో బాబుకి పంచులు వేశాడు. నాగబాబు, తనికెళ్ల భరణి, నదియ, సముద్రఖని, బ్రహ్మాజీ తదితరులు కీలక పత్రాలు పోషించారు. 

Also Read: Sri Lanka Petrol: మరోసారి భారీగా పెరిగిన చమురు ధరలు.. లీటర్‌ పెట్రోల్‌ రూ.420, డీజిల్‌ రూ.400!

Also Read: Tomato Price: తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన టొమాటో ధర, కిలో టొమాటో ఇప్పుడు వంద

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News