K Raghavendra Rao Strong Counter to Tammareddy Bharadwaj: ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టింది, వారు ఇక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ లకు అంతగా ఖర్చు పెడుతున్నారు అని కామెంట్లు చేశారు. ఆ 80 కోట్లు తమకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడతామంటూ ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఆయన మీద విమర్శల వర్షం కురుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లడమే గొప్ప అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆ సినిమా యూనిట్ ని ఆ సినిమా యూనిట్ పడుతున్న కష్టాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఆయన మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఇదే విషయం మీద నాగబాబు కూడా డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నారా? అన్నట్లుగా కామెంట్ చేయగా ఇప్పుడు తాజాగా సీనియర్ దర్శకుడు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కూడా స్పందించారు.


మిత్రుడు భరద్వాజ్ కి అంటూ మొదలు పెట్టిన ఆయన తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి, అంతేగాని 80 ఓట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఉందా అని ప్రశ్నించారు. అంతేకాక జేమ్స్ కెమెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు.


ఇక ఈ వ్యవహారం చూస్తుంటే ఇది మరింత దూరం వెళ్లేలా కనిపిస్తోంది, తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయం మీద తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే తప్ప సినీ పరిశ్రమ నుంచి ఆయనకు వేడి తగ్గేటట్టు కనిపించడం లేదు. మరి ఈ విషయం మీద తమ్మారెడ్డి భరద్వాజ ఎలా స్పందించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ బహుశా ఈ వాడి వేడి పెరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: Garikapati Comments: రామ్ చరణ్ పై గరికపాటి కామెంట్స్.. వారికి నమస్కారం అంటూ!


Also Read: Satish Kaushik Death: గర్భవతిగా ఉన్న నటిని వివాహం చేసుకుంటానన్న నటుడు మృతి.. అసలు ఏమైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి