Kichcha Sudeep's K3 Kotikokkadu Trailer: కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న K3 కోటికొక్కడు మూవీ ట్రైలర్ తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. కిచ్చ సుదీప్ మన తెలుగు హీరో కాకపోయినా... తెలుగు ఆడియెన్స్ అందరికీ ఎంతో సుపరిచితుడే. కన్నడ నాట స్టార్ హీరో అయినప్పటికీ.. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో విలన్ పాత్ర నుంచి బాహుబలి సినిమాలో ఆప్ఘనిస్తాన్‌కి చెందిన యోధుడి పాత్ర వరకు.. తెలుగు వారికే కాకుండా బాలీవుడ్ ఆడియెన్స్‌కి కూడా గుర్తుండిపోయే పాత్రలు చేశాడు. అలా టాలీవుడ్‌లోనూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న నటుడు కిచ్చ సుదీప్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు వారితో కిచ్చ సుదీప్‌కి ఉన్న అనుబంధం సినిమాలకు మించిందే అని చెప్పుకోవచ్చు. ఆ అనుబంధంతోటే తాజాగా తెలుగు వారి ముందుకు K3 కోటికొక్కడు అనే సినిమాతో మరోసారి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు.



 


శివ కార్తిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే నిర్మిస్తున్నారు. ప్రముఖ కన్నడ కంపోజర్ అర్జున్ జన్య మ్యూజిక్ కంపోజ్ చేశాడు. K3 కోటికొక్కడు  మూవీ ట్రైలర్ (K3 Kotikokkadu Trailer) చూస్తోంటే.. బాలీవుడ్ మూవీ రేంజ్‌ని తలపించే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కిచ్చ సుదీప్‌తో (Kichcha Sudeep) పాటు మడోన్నా సెబాస్టియన్, అశిక, శ్రద్ధ, రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.