తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాలా సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ విడుదలైంది. జూన్ 7వ తేదీన కాలా సినిమా రిలీజ్ కానున్నట్టు ఈ పోస్టర్ స్పష్టంచేసింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేసిన ఈ రిలీజింగ్ పోస్టర్‌కి సూపర్ స్టార్ అభిమానుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. తమిళ హీరో ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్, లైకా ప్రొడక్షన్స్ కాలా సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముంబైలో కరికాలనే అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనుండగా బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు నానా పటేకర్ విలన్ పాత్ర పోషించాడు. సూపర్ స్టార్ సరసన ఈశ్వరి రావు ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి మరో ప్రధాన పాత్రలో నటించింది. రజినీకాంత్‌ని కబాలిగా ప్రజెంట్ చేసిన యువ దర్శకుడు పా రంజిత్ కాలా సినిమాను డైరెక్ట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ముంబైలో ధారావి ప్రాంతంలో దాదాపు మూడ్నాలుగు దశాబ్ధాల క్రితం చోటుచేసుకున్న పలు ఘటనల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్టు కాలా యూనిట్ వర్గాలు మొదటి నుంచి చెబుతూ వస్తున్నాయి. జూన్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ఆ తర్వాత మరో వారం రోజులకు రిలీజ్ కానున్న సల్మాన్ ఖాన్ రేస్-3 సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.