Kajal Agarwal Satyabhama: తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస అవకాశాలు అందుకుంటున్న టైంలోనే కాజల్ పెళ్లి చేసుకుని అందరిని షాక్ కి గురిచేసింది. ఇక వెంటనే ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి సినిమాలకు కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంది. అయితే కాజల్ కి క్రేజ్ మాత్రం తగ్గలేదు. పెళ్లి అయిన తరువాత కూడా కాజల్ కి వరస అవకాశాలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలకృష్ణ భగవంత్ కేసరి, కమల్ హాసన్ భారతీయుడు తూ లాంటి భారీ ప్రాజెక్ట్స్ ని అందుకుంది ఈ హీరోయిన్. వీటిల్లో భగవంత్ కేసరి గత సంవత్సరం విడుదలై కాజల్ కి మంచి కమ్ బ్యాక్ సినిమాగా మిగిలింది. ఈ సినిమాలో కాజల్ కి పెద్ద పాత్ర లేకపోయినా కానీ.. ఈ సినిమా విజయం సాధించడంతో కాజల్ కెరీర్ లో ఒక హిట్ సినిమా పడింది. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన సత్యభామ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ తన రాబోయే చిత్రం ఇండియన్ 2 గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న చిత్రం భారతీయుడు 2. ఈ చిత్రం తమిళంలో ఇండియన్ 2 గా రానుంది.


ఈ సినిమా గురించి కాజల్ మాట్లాడుతూ..”నాకు బాబు పుట్టిన వెంటనే నేను రెండు నెలల్లోనే హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. శంకర్ గారి ఇండియన్ 2 సినిమా కోసం నేను హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు చాలా పెయిన్ అనుభవించాను. కానీ కష్టపడి నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఓకే చేసిన సినిమా అది. నేను వద్దు అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకుంటారు. కాని నేను ఆ సినిమా చేయాలనుకున్నాను. డైరెక్టర్ శంకర్ సర్ కూడా నా డేట్స్ అడ్జస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసి సపోర్ట్ ఇచ్చారు. నీ ప్లేస్ లో ఇంకొకరిని తీసుకోను.. నువ్వు అస్సలు భయపడకు అని చెప్పారు శంకర్ సర్. చాలా కష్టంగా ఉన్నా నేను ఇష్టపడి చేశాను, దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను” అని చెప్పుకొచ్చింది కాజల్.


ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.


Also read: Iran President killed: ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా విదేశాంగ మంత్రి ఛాపర్ క్రాష్‌లో దుర్మరణం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook