Kajal Agarwal break: దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీలో నటించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. అయితే ఈ హీరోయిన్ కి తెలుగులో ప్రత్యేక పాపులారిటీ ఉంది. అంతేకాదు అన్ని ఇండస్ట్రీలకన్నా కూడా కాజల్ అగర్వాల్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐశ్వర్యారాయ్ క్యూ హోగయాన సినిమాలో చిన్న పాత్రలో కనిపించి.. సినీ ప్రేక్షకులను పలకరించిన ఈ హీరోయిన్…కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించింది ‌


అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా.. ఈ హీరోయిన్ కి ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఆ సినిమా తర్వాత నుంచి కాజల్ అగర్వాల్ కి అసలు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. 


కాగా ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్.. ప్రెగ్నెంట్ అయిన వెంటనే కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉండింది. కాగా కాజల్ మళ్లీ బాబు పుట్టిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని.. మళ్లీ ఈ మధ్యనే కొన్ని సినిమాలతో బిజీ అయింది. 


ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ కాజల్ అగర్వాల్ దాదాపు రెండు సంవత్సరాల పాటు బ్రేక్ తీసుకోని ఉంది అనే వార్త తెగ వినిపిస్తోంది. ఇంతకీ కారణం ఏమిటంటే కాజల్ అగర్వాల్ మళ్లీ ప్రెగ్నెంట్ అయిందట. ఈ నేపథ్యంలో మరో రెండు సంవత్సరాల పాటు కాజల్ సినిమాల్లో కనిపించకపోవచ్చు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.


Also Read: Bank Merger:  ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..తెలంగాణలో ఈ  బ్యాంక్ కనిపించదు..డిసెంబర్ 27లోపు పనులన్నీ పూర్తి చేసుకోండి


Also Read:PM Kisan: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook