Kajal Aggarwal Body Shaming: ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఇదంతా మామూలే.. బాడీ షేమింగ్ చేసే వారికి కాజల్ కౌంటర్!
Kajal Aggarwal Pregnency: హీరోయిన్ కాజల్ మరి కొన్ని రోజుల్లో తల్లి కాబోతోంది. ఈ క్రమంలో కాజల్ బేబీ బంప్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కాజల్‌పై బాడీ షేమింగ్ ట్రోల్స్ పెరిగిపోవడంతో ఆమె రియాక్ట్ అయింది.
Kajal Aggarwal counter on Body shaming: మహిళలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వారి బాడీలో చాలా మార్పులు వస్తాయంటోంది హీరోయిన్ కాజల్. కాజల్ కొన్ని రోజుల క్రితం తన సోదరి నిషా అగర్వాల్ కుమారుడితో కలిసి ఒక యాడ్‌లో నటిచింది. ఒరియో బిస్కట్స్‌కు సంబంధించిన ఈ యూడ్‌లో కాజల్ బేబీ బంప్‌తో కనిపించింది. అయితే అందులో కాజల్ బాడీషేప్‌పై చాలా మంది నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేశారు.
ఇక ఒక్కోసారి మునుపటి మాదిరిగా బాడీ మారకపోవచ్చని అని తెలిపింది. అయితే ఈ మార్పులు అన్నీ కూడా సర్వసాధారణమే అని కాజల్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయినా మన లైఫ్‌లోకి ఒక బేబీ రాబోతుందన్న హ్యాపీనెస్ ముందు ఇలాంటివన్నీ పట్టించుకోకండి అంటూ ఆమె సూచించింది. ఇలా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసింది.
Also Read: Rishabh Pant Opener: వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రిషబ్ పంత్ ఓపెనర్‌గా రావడానికి కారణం ఇదే!!
Also Read: IND vs WI 2nd ODI: టీమిండియాదే బ్యాటింగ్.. రాహుల్ ఆయేగా! ఓపెనర్‌గా టీమిండియా కొత్త ప్రయోగం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook