Kajal Aggarwal Son : కాజల్ కొడుకు పోజులు మామూలుగా లేవు.. సంబరపడిపోతోన్న హీరోయిన్
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తల్లిగా తన సంతోషాన్ని అందరితో పంచుకుంది. తన కొడుకుని చూసుకుంటూ మురిసిపోయింది. తన కొడుకు పుట్టి ఆరు నెలలు అవుతోన్న సందర్భంగా ఈ పోస్ట్ వేసింది. ఇందులో తన కొడుకు గురించి చెబుతూ.. తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఎంత సంతోషంగా ఉందో చెప్పుకొచ్చింది. ఇక ఇందులో కాజల్ కొడుకు పెట్టిన పోజు చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
Kajal Aggarwal Son Neil Kitchlu : కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తల్లిగా తన సంతోషాన్ని అందరితో పంచుకుంది. తన కొడుకుని చూసుకుంటూ మురిసిపోయింది. తన కొడుకు పుట్టి ఆరు నెలలు అవుతోన్న సందర్భంగా ఈ పోస్ట్ వేసింది. ఇందులో తన కొడుకు గురించి చెబుతూ.. తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఎంత సంతోషంగా ఉందో చెప్పుకొచ్చింది. ఇక ఇందులో కాజల్ కొడుకు పెట్టిన పోజు చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
'గత ఆరు నెలలు నా జీవితంలో ఎలా గడిచిపోయాయో నాకు తెలియడం లేదు.. ఎంతో సంతోషంగా గడిచిపోయాయి. యంగ్‌గా ఉన్నప్పుడు.. నేను ఓ తల్లిలా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానా? లేదా? అన్న అనుమానం, భయం నాలో ఉండేది. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాను. నేను పనులతో ఎంత బిజీగా ఉన్నా.. నీ కోసం నా సమయాన్ని కేటాయిస్తుంటాను..
నీపై ఎప్పుడూ అశ్రద్ద చూపించను.. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను.. అది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా ఇప్పుడు నేను అనుభవిస్తోన్న సంతోషం ముందు చిన్నదే అనిపిస్తోంది.. రాత్రుల్లో నువ్ అటూ ఇటూ దొర్లడం, నేలపై పాకడం చూస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది.. నీకు బాగా లేకపోవడం, దెబ్బలు తాకడం, స్విమ్మింగ్ పూల్, సముద్రంలో ఆడుకోవడం, ఫుడ్ టేస్ట్ చేయడం అన్నీ నాకు ఇంకా గుర్తున్నాయ్..
టైం ఇలా త్వరత్వరగా ముందుకు సాగుతూ ఉంటుంటే.. నేను, నీ డాడీ కలిసి నీ కాలేజ్ రోజులను తలుచుకుంటూ నవ్వుకుంటున్నాం.. నీ తల్లిగా నన్ను ఆ భగవంతుడు ఎంచుకోడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.. తల్లిగా చేసే బాధ్యతలు గొప్పవని అందరూ అంటుంటారు.. ఇదంతా నాకు కొత్తే గానీ ఎంతో సంతోషంగా ఉంది.. నువ్ పుట్టి ఏడాది అవ్వడానికి ఇంకా సగం దూరం ఉంది.. మై లవ్ మై బేబీ నీల్'.. అంటూ కాజల్ ఎమోషనల్ పోస్ట్ వేసింది.
కాజల్ ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. కాజల్ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. కానీ కాజల్ మాత్రం తన ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తోంది. కాజల్ చేసే యాడ్స్, ఇన్ స్టాలో పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. తన ఫ్యామిలీ ఫోటోలను, భర్త, కొడుకులతో ఉన్నఫోటోలను కాజల్ షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా తన కొడుకు నీల్ గురించి వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read : NBK Unstoppable : సీనియర్ నటి, కుర్ర హీరోయిన్లతో బాలయ్య సందడి
Also Read : Sapthami Gowda Allu Aravind: అల్లు అరవింద్ కాళ్లపై పడిన హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook