NBK Unstoppable : సీనియర్ నటి, కుర్ర హీరోయిన్లతో బాలయ్య సందడి.. అన్‌స్టాపబుల్ గెస్టులు వీళ్లేనట

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో దుమ్ములేపేస్తోంది. రెండో సీజన్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వంటి వారిని తీసుకొచ్చి.. పర్సనల్ ముచ్చట్లు పెట్టిన బాలయ్య అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందులో అంతర్లీనంగా పొలిటికల్ అజెండా ఉందని కొందరు నెగెటివ్ కామెంట్ చేసినా కూడా ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 03:36 PM IST
  • దూసుకుపోతోన్న బాలయ్య అన్‌స్టాపబుల్
  • మూడో ఎపిసోడ్ మీద వచ్చిన లీక్ ఇదే
  • బాలయ్యతో రమ్యకృష్ణ, రాశీ ఖన్నా సందడి?
NBK Unstoppable : సీనియర్ నటి, కుర్ర హీరోయిన్లతో బాలయ్య సందడి.. అన్‌స్టాపబుల్ గెస్టులు వీళ్లేనట

NBK Unstoppable season 2 Episode 3 : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో దుమ్ములేపేస్తోంది. రెండో సీజన్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వంటి వారిని తీసుకొచ్చి.. పర్సనల్ ముచ్చట్లు పెట్టిన బాలయ్య అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందులో అంతర్లీనంగా పొలిటికల్ అజెండా ఉందని కొందరు నెగెటివ్ కామెంట్ చేసినా కూడా ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది.

నాలుగు రోజుల్లోనే ఈ ఎపిసోడ్‌కు వంద మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి. అలా ఈ మొదటి ఎపిసోడ్ గ్రాండ్ సక్సెస్ అయింది. వెన్నుపోటు అంశం మీద ప్రధానంగా చర్చించుకోవడం, బాలయ్య చంద్రబాబు ఆ ఘటన మీద స్పందించడంతో రాజకీయంగా అది మలుపు తిరిగింది. ఇక నారా లోకేష్ పర్సనల్ ఫోటోలను కూడా బయటపెట్టేశాడు బాలయ్య. ఇలా తన బావ, అల్లుడిలో బాలయ్య సందడి చేశాడు.

రెండో ఎపిసోడ్‌లో భాగంగా విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డ, నిర్మాత నాగవంశీ వంటి వారితో ముచ్చట్లు పెట్టేశాడు. ఇది ఈ వారం ప్రసారంలోకి వస్తుంది. ఇందులో బాలయ్య మాట్లాడిన మాటలు, త్రివిక్రమ్‌తో ఫోన్ కాల్‌, అందులో బాలయ్య మాట్లాడిన మాటలతో ఈ రెండో ఎపిసోడ్ మీద అందరికీ అంచనాలు పెరిగాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి రెండో సీజన్లో వస్తారేమోననే కామెంట్లు వస్తున్నాయి.

తాజాగా మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. మూడో ఎపిసోడ్లో రమ్యకృష్ణ, రాశీ ఖన్నాలు రాబోతోన్నారనే టాక్ బయటకు వచ్చింది. షూటింగ్ ఈ వీకెండ్ జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు తప్పు అని, గెస్టులు వాళ్లు కాదని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి మూడో ఎపిసోడ్ మీద మాత్రం అందరికీ అంచనాలు పెరిగిపోయాయని అర్థమవుతోంది.

మొదటి సీజన్లో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య కలిసి కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ అది నెరవేరలేదు. ఈ రెండో సీజన్ ప్రారంభ ఎపిసోడ్లో చిరంజీవి వస్తారని గాసిప్ వచ్చింది. అది కూడా జరగలేదు. మరి ఈ రెండో సీజన్ ఎండింగ్ ఎపిసోడ్లోనైనా చిరంజీవి వస్తాడా? బాలయ్య చిరు కలిసి సందడి చేస్తారా? అన్నది చూడాలి. ఇప్పటికి అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కలిసి గెస్టులుగా బాలయ్య ముందుకు వస్తారననే ప్రచారం మాత్రం ఊపందుకుంది. ఆ ఫోన్ కాల్ కథ ఏంటో తెలియాలంటే రెండో ఎపిసోడ్ చూడాల్సిందే.

Also Read :  Comedian Harsha Chemudu : పెళ్లై ఏడాది.. కాశ్మీర్ లోయలో సందడి.. భార్యతో కమెడియన్ హర్ష ట్రిప్

Also Read : Balakrishna Kind Gesture: అన్నం పెట్టిన వాళ్లకి ఆపదొస్తే తట్టుకోలేక పోయాడు.. మూడే రోజుల్లో హాస్పిటలే కదిలొచ్చింది.. దటీజ్ బాలయ్య!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News