Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'కల్కి 2898 AD' మూవీ  భారీ ఎత్తున తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ ఈ  సినిమాను నిర్మించారు.  ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తైయింది. ప్రభాస్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసాడు. మరోవైపు దీపికా పదుకొణే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసింది. అది కూడా హిందీతో పాటు తన మాతృభాష కన్నడలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగులో కూడా చెప్పినా.. కుదరకపోవడంతో సునీతతో చెప్పిస్తున్నారట. తమిళం, మలయాళంలో ఆయా భాషల్లో మంచి డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ పనులు పూర్తి చేయించే పనిలో పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కల్కి సినిమాను టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కించినట్టు దర్శకుడు నాగ్ అశ్విన్. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే  వంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో ప్రభాస్ కాల భైరవ పాత్రలో నటిస్తే.. అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామా పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను జూన్ 27న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.


ఇక ఈ సినిమా ఓవ‌ర్సీస్, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రైట్స్ భారీ రేటుకు సోల్డ్ అయ్యాయి. ఈ సినిమా క‌ర్ణాట‌క రైట్స్‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడ‌క్ష‌న్స్ కళ్లు చెదిరే రేటుకు కైవసం చేసుకున్నట్టు ఫిల్మ్ నగగర్ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా దాదాపు రూ. 25 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్టు స‌మాచారం. ఇక ఈ సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్ దాదాపు రూ. 50 కోట్ల వ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్టు స‌మాచారం. ఇక డిజిట‌ల్ రైట్స్ అన్ని భాష‌ల‌కు క‌లిపి దాదాపు రూ. 250 కోట్ల‌కు సోల్డ్ అయినట్టు సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ అన్ని భాష‌ల‌కు క‌లిపి  దాదాపు రూ. 100 కోట్లు.. ఆడియో ఇత‌ర‌త్రా అన్ని రైట్స్ క‌లిపి రూ. 50 కోట్ల వ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్టు స‌మాచారం. మొత్తంగా నాన్ థియేట్రిక‌ల్‌గా ఈ సినిమా రూ. 400 కోట్ల టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకున్న‌ట్టు స‌మాచారం.  



'కల్కి 2898 AD'సినిమా భారతీయ సినీ చరిత్రలో మరో మైలు స్టోన్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  'కల్కి' మూవీ మహాభారత కాలంతో  మొదలై సామాన్య శకం 2898 ADతో ముగుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని 'కల్కి' మూవీలో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాను రెండు పార్టులుగా రాబోతున్నట్టు మరో వార్త వినిపిస్తోంది. అంతేకాదు ఇందులో  నాటి రోజులకు తగ్గట్టు భారతీయత ఉట్టిపడేలా ఓ కొత్త ప్రపంచాన్నే ఈ సినిమా యూనిట్ క్రియేట్ చేసారు. ఈ సినిమా తర్వాత ముందుగా మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీని చేయనున్నారు ప్రభాస్. ఆ తర్వాత  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ ఉండనే ఉంది. అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ఘార్ధ్ ఆనంద్, అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. అటు కన్నప్ప సినిమాలో ప్రభాస్.. మహా శివుడి పాత్రలో  కనిపించబోతున్న సంగతి తెలిసిందే కదా.  ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్‌లో ప్ర‌భాస్ జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే క‌దా.


Also Read: Madhavi Latha: ఓల్డ్ సిటీలో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ సంచలనం.. నఖాబ్ ఓపెన్ చేసి చెక్ చేసిన మాధవీలత..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter