Kalki 2898 AD: మూడు రోజుల్లో హృతిక్ ఆ రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్ ‘కల్కి’ మూవీ..
Kalki 2898 AD: మూడు రోజుల్లో కేవలం మూడంటే మూడు రోజుల్లో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మూవీకి సంబంధించిన ఓ రికార్డును బ్రేక్ చేసింది. ఇంతకీ కల్కి క్రియేట్ చేసిన ఆ రికార్డు ఏమిటంటే.. ?
Kalki 2898 AD: అవును ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా కళ్లు తిరిగే వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి విదేశాల్లోకూడా ఈ సినిమాకు ఇప్పటికే మన దేశ కరెన్సీలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఔరా అనిపించింది. అంతేకాదు ఈ యేడాది హిందీలో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 364 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తం థియేట్రికల్ రన్ లో ఈ సినిమా సాధించిన వసూళ్లను ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ
కేవలం మూడంటే మూడు రోజుల్లో బ్రేక్ చేయడం విశేషం.
ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 400 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన ఈ సినిమా .. 4వ రోజైన ఆదివారం వసూళ్ల సునామి క్రియేట్ చేసింది. ఇక హిందీ బెల్ట్ లో ఈ సినిమా దూసుకుపోతుంది. మరోవైపు మొత్తం ఇప్పటి వరకు రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సినిమా ముందు ముందు ఏయే సినిమాల హైయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లను రాబట్టిన రికార్డులను బ్రేక్ చేస్తుందనేది చూడాలి.
మొత్తంగా కల్కి మూవీ ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లను రాబట్టి సాలిడ్ గా రన్ అవుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు ఈ సినిమా దాదాపు రూ. 26 కోట్ల షేర్.. (రూ. 52 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 50 కోట్ల షేర్ (రూ.98 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఏది ఏమైనా నేటి నుంచి వర్కింగ్ డే కాబట్టి వసూళ్ల జోరు కాస్త తగ్గే అవకాశాలున్నాయి. అయినా.. చాలా చోట్ల ఈ సినిమా సాలిడ్ బుకింగ్స్ తో స్ట్రాంగ్ గా ఉంది. ఏది ఏమైనా రెండో వారం వరకు ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తుందో చూడాలి.
Also Read: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter.