Kalyan Dev: విడాకుల వార్తల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్.. దాని గురించేనా?
Kalyan Dev Hinting: మెగా డాటర్ శ్రీజతో కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నాడని ప్రచారం జరుగుతున్నా నేపధ్యంలో ఆయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
Is Kalyan Dev Hinting about his Divorce: చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తొలుత శిరీష్ భరద్వాజ్ అనే ఒకరిని ప్రేమించి వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్య పరిస్థితులలో వీరు విడిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మరోసారి రెండో పెళ్లి వాడైన కళ్యాణ్ దేవ్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మెగా కుటుంబం సపోర్ట్ ఉండటంతో విజేత అనే సినిమాతో ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా హిట్ కాకపోయినా నటుడిగా కళ్యాణ్ దేవ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. మెగా కుటుంబం కావడంతో ఆయనకు వరుస సినీ అవకాశాలు లభించాయి.
అలాగే ఆయన సూపర్ మచ్చి, కిన్నెరసాని వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే కిన్నెరసాని సినిమా నేరుగా జీ 5 ద్వారా విడుదలైంది, సూపర్ మచ్చీ సినిమా సంక్రాంతికి ధియేటర్లలో విడుదలైంది కానీ ప్రమోషన్స్ కి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో కూడా ఒకరి గురించి ఒకరు ప్రస్తావించుకోకపోవడం ఒకరిని ఒకరు ఫాలో కాక పోవడంతో వీరి మధ్య ఏదో జరిగిందని విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి కళ్యాణ్ దేవ్ గతంలో చిరంజీవి నివాసంలోనే ఎక్కువగా ఉండేవారు.
కానీ ఇప్పుడు ఆయన అక్కడ ఉండడం లేదు. శ్రీజ తన పెద్ద కుమార్తె పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా అందులో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. గత పుట్టినరోజుకి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపిన కళ్యాణ్ దేవ్ ఈ ఏడాది మాత్రం విషెస్ తెలపకపోవడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఇన్ని అనుమానాల నేపథ్యంలో కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అయింది. అదేమిటంటే తన తల్లి పుట్టిన రోజు నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కళ్యాణ్ దేవ్ పోస్ట్ పెట్టాడు.
జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించే ధైర్యం నీ ప్రేమ అందిస్తుంది, నన్ను వెనక ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు, హ్యాపీ బర్త్డే అమ్మ అంటూ కళ్యాణ్ దేవ్ పోస్ట్ పెట్టారు. అంతే కాక ఆమె కేక్ కట్ చేస్తున్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కొంచెం ఏదైనా అవకాశం కనిపిస్తే రెచ్చిపోయే నెటిజన్లు కూడా కళ్యాణ్ దేవ్ ప్రస్తావించిన ఆ కఠిన పరిస్థితులు శ్రీజ నుంచి దూరమైన పరిస్థితులేనా అంటూ ఆరా తీస్తున్నారు. శ్రీజ దూరమైన విషయాన్ని ఇలా కళ్యాణ్ దేవ్ పరోక్షంగా హింట్ ఇస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి కళ్యాణ్ దేవ్ ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ శ్రీజ దూరమైందని ఇలా పోస్ట్ పెట్టాడు అంటూ నెటిజన్లు తీర్పు ఇచ్చేశారు.
Also Read: Pooja Hegde: బికినీ ట్రీట్ ఇచ్చిన బుట్టబొమ్మ.. సముద్రం ఒడ్డున సొగసరి పూజా హొయలు!
Also Read: మణిరత్నం సినిమానే వదులుకున్న కీర్తి సురేశ్.. కారణం ఏంటో తెలుసా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook