Devil: బ్లాక్ బస్టర్ కి సిద్ధమైన కళ్యాణ్ రామ్.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
Devil Censor: వైవిధ్యమైన కథలు ఎంచుకునే కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన అమిగోస్ పర్వాలేదు అనిపించుకున్న మళ్ళీ ఇప్పుడు డెవిల్ అనే వైవిద్యమైన స్పై థ్రిల్లర్ తో మన ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకోవడానికి సిద్ధమైపోయారు..
Kalyan Ram: 2023 తెలుగు సినిమా కొన్ని సూపర్ హిట్ లు కొన్ని ఫ్లాప్ లతో ఫైనల్ గా ఈ సంవత్సరానికి ఎండ్ కార్డ్ వేసుకొనుంది. కాగా సినీ లవర్స్ విషయానికి వస్తే ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ మూవీస్ యానిమల్, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. వైవిధ్యమైన కథలను ఎంచుకునే కళ్యాణ్ రామ్ మరోసారి వైవిధ్యమైన కాన్సెప్ట్ తో చేసిన సినిమా డెవిల్.
గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 29న ‘డెవిల్’తో ఈ సంవత్సరం ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. 12 మిలియన్ వ్యూస్‌ను దాటి ట్రైలర్ దూసుకెళ్తోంది.
ఇక ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్‌లో చూడని సరికొత్త డైమన్షన్‌ను డెవిల్ చూపించబోతుంది అని ఈ సినిమా దర్శకుడు ఈ మధ్యనే చెప్పారు. బ్రిటీష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారనే విషయాన్ని అసలు ఎవరూ ఊహించలేరు… అలాంటి కొత్త విషయాన్ని డెవిల్ మూవీలో ఆవిష్కరించబోతున్నారు ఈ సినీ దర్శకుడు. కాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా డెవిల్ రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.
ఇక ఈ ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా అప్పటి బ్రిటీష్ కాలాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించారు. మేకింగ్ పరంగా బడ్జెట్ విషయంలో నిర్మాత అభిషేక్ నామా ఎక్కడా రాజీపడలేదని స్పష్టమవుతోంది.
డెవిల్ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. వీటన్నింటిని నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లేలా హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది అని తెలుస్తోంది.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook