Radhika in Kamal Haasan Birthday Party : కమల్ హాసన్‌ ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోలేడు. తన కెరీర్‌ను అలా మరో పదేళ్లు నిలబెట్టే చిత్రం వచ్చింది. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ మళ్లీ తన స్టామినా చూపించాడు. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ క్రియేట్ చేసిన రికార్డులు అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ సినిమా నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసింది విక్రమ్ చిత్రం. ఈ సినిమా దెబ్బతో కమల్ హాసన్ అప్పులన్నీ తీరిపోయాయి.కమల్ హాసన్ ప్రొడక్షన్ కంపెనీ వ్యాల్యూ పెరిగింది. కమల్ హాసన్ మార్కెట్ రేంజ్‌ అందరికీ తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన ఈ విక్రమ్ సినిమా కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించింది. కమల్ హాసన్ దెబ్బకు బాక్సాఫీస్ వణికి పోయింది. తెలుగులోనూ ఈ సినిమా లాభాల పంట పండించింది. అలా మొత్తానికి కమల్ హాసన్ అయితే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక ఆయన తదుపరి చిత్రాలన్నీ పట్టాలెక్కేశాయి. ఆగిపోయిందనుకున్న ఇండియన్ 2 సినిమా కూడా మళ్లీ ప్రారంభమైంది. అలా ఈ ఏడాది కమల్ హాసన్ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా మిగిలింది.


 



అందుకే ఈ ఏడాది బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇండస్ట్రీ అంతటిని పిలిచాడు. పార్టీ ఇచ్చాడు. ఇప్పుడు కమల్ హాసన్ బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో నాటి హీరోయిన్లు సందడి చేశారు. అంతా కూడా బ్లాక్ డ్రెస్సులో కనిపించారు. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి.


విక్రమ్ సినిమాలోని మత్తుగా మత్తుగా అనే పాటకు కమల్ హాసన్ చిందులు వేశాడు. రాధిక కూడా మధ్యలో జాయిన్ అయింది.ఈ ఇద్దరూ వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పార్టీ వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.


Also Read : Anchor Vishnu Priya : లోదుసుల్లో లోఫర్ భామ.. బికినీలో కవ్వించిన దిశా పటాని.. తనకూ ఆ కోరిక ఉందన్న విష్ణుప్రియ


Also Read : హిట్లు లేకున్నా మెగాస్టారే.. సీమలో బాలయ్యను చిత్తు చేసిన బాలకృష్ణ!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook