Shankar Game Changer Update: పాన్ ఇండియా సినిమాలు అంటే.. పెద్దగా తెలియని కాలంలోనే.. దర్శకుడు శంకర్.. పేరు నేషనల్ వైడ్ గా మారుమోగింది. భారతీయుడు, జీన్స్, జెంటిల్ మాన్, అపరిచితుడు, శివాజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు ఈ డైరెక్టర్. అయితే ఆ తరువాత నుంచి.. నెమ్మదిగా శంకర్ పరిస్థితి మారుతూ వచ్చింది. విక్రమ్ తో తీసిన ఐ.. సినిమా దగ్గర నుంచి.. ఈ దర్శకుడికి ఫ్లాపులు రావడం మొదలయ్యాయి. దాంతో తన అంచనాలు అన్ని భారతీయుడు సీక్వెల్.. పైనే పెట్టుకున్నారు. వరస ఫ్లాపులు వస్తున్న కాలంలో.. తనను స్టార్ డైరెక్టర్గా నిలబెట్టిన.. భారతీయుడు సినిమాకి సీక్వెల్ తీయాలి అని శంకర్ అనుకున్నప్పుడు.. ఎంతోమంది ఆశ్చర్యపోయారు. అయితే ఆయన అభిమానులు మాత్రం.. ఈ సినిమాతో శంకర్ కం బ్యాక్ ఇస్తారని నమ్మకం పెట్టుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక శంకర్ భారతీయుడు సినిమా సీక్వెల్ చేస్తూనే.. రామ్ చరణ్ గేమ్ చేంజర్..షూటింగ్ కూడా జరిపారు. శంకర్ మామూలుగా ఒక సినిమా తీయడానికి.. మూడు సంవత్సరాలు టైం తీసుకుంటారు. కానీ గరిచిన మూడు సంవత్సరాలలో.. భారతీయుడు 2, భారతీయుడు 3 తో పాటు.. గేమ్ చేంజర్ షూటింగ్ బాధ్యతలు కూడా తన పైన వేసుకున్నారు ఈ డైరెక్టర్. 


ఇక్కడి వరకు కథ బాగానే ఉన్నా.. ఈరోజు విడుదలైన భారతీయుడు 2 రివ్యూస్ చూస్తుంటే..రామ్ చరణ్ అభిమానులు అయోమయంలో.. పడక తప్పేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం రాజమౌళి,‌ నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు..కొత్త కొత్త కాన్సెప్ట్లతో వస్తు.. పాన్ ఇండియా పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే దర్శకుడు శంకర్ మాత్రం పాత చింతకాయ పచ్చడిలా.. కరప్షన్.. అనే ఫార్ములాని పట్టుకొని తిరుగుతున్నారు. 


కరప్షన్ అనే ఫార్ములాని.. కనీసం ప్రస్తుత ట్రెండ్ కి సరిపడేటట్టు తీసిన ఒక అర్థం ఉంటుంది. కానీ భారతీయుడు 2 సినిమాలో.. తన గత చిత్రం అపరిచితుడు లాగానే.. సేమ్ కథ, కథనం ఫాలో అయ్యి.. శంకర్ పూర్తిగా ఔట్ డేటెడ్ అయిపోయాడు అని ప్రేక్షకులు.. అనేలా చేసుకున్నాడు. 


ఈరోజు విడుదలైన ఈ సినిమా మొదటి షో.. నుంచే మిక్సడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో.. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా శంకర్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే.. దాదాపుగా కరప్షన్.. పైనే ఉండేటట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు.. ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లను.. బట్టి చూస్తే ఒక ఫ్లాష్ బ్యాక్.. దానికి తోడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన అన్యాయం కోసం.. పగ తీర్చుకోని ప్రస్తుత తరంలో హీరో.. ఇలా శంకర్ పాత సినిమాలే గుర్తొస్తున్నాయి. 


మొత్తానికి గేమ్ చేంజర్ లో కూడా.. అపరిచితుడు, జెంటిల్ మాన్.. ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా పై ఇప్పటినుంచే.. రామ్ చరణ్ అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందిగా.. కనిపిస్తోంది. భారతీయుడు 2 చిత్రంలో కమల్ హాసన్ వందకు వందశాతం నటించాడు. అయినా కానీ శంకర్ పాత ఫార్ములా.. ప్రస్తుతం తరం ప్రేక్షకులకు ఎక్కక.. ఈ చిత్రంకి మిక్స్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో శంకర్ ఇదే ఫాలో అయ్యి.. గేమ్ చేంజెర్.. సినిమా కూడా రామ్ చరణ్ నటన పైన మాత్రమే రన్ అయితే.. ఆ సినిమా డిజాస్టర్ కావడం ఖాయం.  అందులో రామ్ చరణ్ ఈ చిత్రం కోసం ఏకంగా మూడు సంవత్సరాలు వేస్ట్ చేశారు. మరి ఈ చిత్ర పరిస్థితి ఏమిటో తెలియాలి అంటే ఈ సంవత్సరం చివరి వరకు వెయిట్ చూడాల్సిందే.


Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.


Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి