Shruti Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా మాత్రమే కాక టాలీవుడ్ హీరోయిన్ గా కూడా శృతిహాసన్ కి మంచి పేరుంది. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శృతిహాసన్. ఈ మధ్యనే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే తాజాగా ఇప్పుడు శృతిహాసన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా నటించనుందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యన ఈ జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ఇప్పుడు జ్ఞానవెల్ దర్శకత్వంలో వెట్టయాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 


ఈ సినిమా పూర్తయిన తర్వాత రజనీకాంత్ తన కెరియర్లో 171 సినిమా తో బిజీ కాబోతున్నారు. స్టార్ కాలిబర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కలుగు అనే ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 


ఈనెల 22న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కి సిద్ధం అవుతుంది. ఇక ఈ ఏడాది జూన్ నుంచి చిత్ర షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శృతిహాసన్ రజినీకాంత్ కూతురి పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 


గతంలో దాదాపు 25 ఏళ్ల క్రితం రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి ఒక సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కమల్ హాసన్ కూతురు రజనీకాంత్ కూతురి పాత్రలో కనిపించడానికి రెడీ అవుతూ ఉండటం అభిమానులను మరింత ఆనందపరుస్తోంది. 


ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శృతిహాసన్ చేతిలో ఇప్పుడు కొన్ని బడా ప్రాజెక్టులు ఉన్నాయి. రజనీకాంత్ తో సినిమా కూడా ఆమె కెరియర్ కి బాగా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..


Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..


Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి