Kamal Haasan Viral Twitter post : సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి, ఒక్కో బిరుదు ప్రేక్షకులు,  అభిమానులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉదాహరణకు విజయ్ ను దళపతి అని, చిరంజీవిని మెగాస్టార్ అని, రజనీకాంత్ ను తలైవా అని ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమాన హీరోలను పిలుస్తూ ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక అలాగే అజిత్ ను థాలా అని, కమలహాసన్ ను ఉలగనాయగన్ అంటూ పిలుస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు కమలహాసన్ తన పేరుకు ముందు ఇలాంటి పేర్లు కలిపి పిలువవద్దు అని వేడుకున్నారు. ముఖ్యంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక సుదీర్ఘ నోటు వదులుతూ తనను కమల్ హాసన్ లేదా కమల్ లేదా కే హెచ్ అని మాత్రమే పిలవాలి అని అటు అభిమానులతో ఇటు మీడియాతో అలాగే ఆడియన్స్, రాజకీయ పార్టీ కార్యకర్తలను కూడా అభ్యర్థించారు కమల్ హాసన్. 


తన ప్రకటనలో కమలహాసన్.. “నా అభిమానులు, మీడియా,  సినీ సోదరులు , పార్టీ కేడర్ అలాగే తోటి భారతీయులు అందరూ కూడా నన్ను కమలహాసన్ లేదా కమల్ లేదా కే హెచ్ అని మాత్రమే పిలవాలని వినయంగా అభ్యర్థిస్తున్నాను అంటూ తెలిపారు. అయితే ఏ కారణాల చేత కమలహాసన్ ఇలాంటి పోస్ట్ షేర్ చేశారు అన్నది మాత్రం అభిమానులకు తెలియడం లేదు. 


అంతకుముందు 2021 లో కూడా నటుడు అజిత్ కుమార్ తన అభిమానులను, ప్రజలను అలాగే మీడియా ని కూడా తన పేరుకు ముందు థాలా అనే పదాన్ని వాడొద్దని సూచించారు. తనని కేవలం అజిత్ లేదా అజిత్ కుమార్ లేదా ఏకే అని మాత్రమే పిలిస్తే చాలు అని అభ్యర్థించారు. 


మొత్తానికి అయితే కమల్ హాసన్ కూడా అజిత్ మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ఉలగనాయగన్ వంటి మనోహరమైన బిరుదులను అందించినందుకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను.  ప్రజలచే అందించబడిన..ఈ గౌరవనీయమైన గుర్తింపుకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను.  సినిమా కళ ప్రతి ఒక్క వ్యక్తికి మించి ఉంటుంది. నేను కేవలం విద్యార్థిని మాత్రమే.. ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందాలని ,నేర్చుకోవాలని, ఎదగాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఇంత పెద్ద పెద్ద బిరుదులు నాకు వద్దు అంటూ ఆయన తెలిపారు.


 



Also Read: దారుణం.. జర్నలిస్టులను పరిగెత్తించి మరీ కొట్టిన మల్లారెడ్డి ఆస్పత్రి బౌన్సర్లు, వీడియో వైరల్‌..


Also Read: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.