Vikram - The First Glance video: కమల్ హాసన్ అప్‌కమింగ్ సినిమా విక్రమ్ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. నవంబర్ 6న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ పేరిట మేకర్స్ ఈ వీడియో విడుదల చేశారు. యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మరో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో పాటు (Vijay Sethupathi), మళయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమల్ హాసన్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో లోకేష్ కనగరాజ్ చూపించనున్నట్టు మూవీ యూనిట్ వర్గాలు ముందు నుంచి చెబుతూ వస్తున్నాయి. దీంతో విక్రమ్ సినిమాపై కమల్ హాసన్ అభిమానుల్లో (Kamal Haasan's fans) అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. దీనికితోడు డైరెక్టర్ కనగరాజ్ సైతం మాస్టర్ తర్వాత వరుసగా మరో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.