Emergency Movie First Look: ఢాకడ్ లాంటి ఒక డిజాస్టర్ సినిమా తర్వాత, ఎట్టకేలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన కొత్త సినిమాను ప్రకటించింది. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి జయలలిత వంటి బలమైన పాత్రలను పోషించిన తర్వాత కంగనా రనౌత్ మరోమారు తన అభిమానులను ఆశ్చర్య పరిచింది. కంగనా రనౌత్ ఇప్పుడు దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్రను పోషించబోతోంది. ఇక ఆ సినిమా పేరు ఎమర్జెన్సీ. కంగనా రనౌత్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. దీంతో కంగనా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా టీజర్ వీడియో కూడా షేర్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టీజర్‌లో, ఇందిరాగాంధీగా మారిన కంగనా రనౌత్, తన కార్యాలయంలో తనను మేడమ్ అని కాకుండా 'సర్' అని పిలుస్తారని అమెరికా అధ్యక్షుడికి సందేశం ఇవ్వమని కోరింది. ఇక ఈ వీడియోలో కంగనా లుక్, ఎక్స్‌ప్రెషన్స్ నుండి ఆమె వాయిస్ వరకు ఇందిరాగాంధీకి మ్యాచ్ అయ్యేలా చాలా గట్టి ప్రయత్నమే చేసినట్టు కనిపిస్తోంది. ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పర్ఫెక్ట్ గా క్యాచ్ చేసిందని ఒప్పుకోవాలి. కంగనా రనౌత్‌ను ఇందిరాగాంధీలా కనిపించేలా చేయడానికి ఆమె ప్రొస్తెటిక్ మేకప్ ఎవరు చేశారో కానీ చాలా కష్టపడ్డారు. ఆ ఫలితం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది.


అందుకే  కంగనా రనౌత్ సరిగ్గా ఇందిరా గాంధీలానే కనిపిస్తుంది. కంగనా రనౌత్ లుక్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాతో కంగనా మరోమారు బాలీవుడ్ ను షేక్ చేయనుందని ఆమె అభిమానులు అంటున్నారు. ఈ సినిమాతో కంగనా మరోసారి నేషనల్ అవార్డ్ కైవసం చేసుకోనుందని అభిమానులు భావిస్తున్నారు.  ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ లు ఇంత బాగున్నాయి అంటే సినిమా ఎంత బ్రహ్మాండంగా ఉండబోతుందో అని లెక్కలు వేసుకుంటున్నారు. రితేష్ షా ఈ ఎమర్జెన్సీ చిత్రానికి రచయిత కాగా కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.


అంతే కాక ఆమె సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎమర్జెన్సీ సినిమా కోసం ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ డేవిడ్ మలినోవ్‌స్కీ కంగనాకు ప్రొస్తెటిక్ మేకప్ చేశారు. డేవిడ్ తన వర్క్ కు గాను ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. అలాంటి ఆయన చేయి పడడంతో కంగనా మేకోవర్ అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. 




Also Read: Neetu Chandra: పెళ్లాంగా ఉంటే నెలకు 25 లక్షలు.. దారుణమైన విషయం బయటపెట్టిన నీతూ చంద్ర!


Also Read: Justice For Koratala Shiva: కొరటాల శివ సెటిల్మెంట్ వ్యవహారం ఏంటి.. అసలు ఏమి జరిగిందంటే?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.