Leelavathi Passes away: భారతీయ చలనచిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. శుక్రవారం ప్రముఖ బాలీవుడ్ నటుడు  జూనియర్‌ మెహమూద్‌.. మలయాళ యువనటి లక్ష్మిక సజీవన్ మృతి చెందారు. తాజాగా మరో సీనియర్ నటి కన్నుమూశారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటి లీలావతి బెంగళూరులోని నేలమంగరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 85 ఏళ్ల వయసులో లీలావతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె మరణించినట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల సినీ కెరీర్లో ఆమె  కన్నడతో పాటు తమిళం, తెలుగు, మలయాళం భాషలతో కలిపి మొత్తం 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఒక్క కన్నడలోనే 400కుపైగా చిత్రాల్లో నటించారు.తెలుగులో ఐదు చిత్రాల్లో కనిపించారు లీలావతి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1937లో దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలో జన్మించిన లీలావతి.. 1958లోమాంగల్య యోగ మూవీతో తెరంగేట్రం చేశారు. కన్నడ స్టార్ రాజ్‍కుమార్‌ సరసన ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‍గా నటించారు ఆమె. లీలమ్మ, భక్త కుంబర, మన చోషిద మాదాడి, శాంతా తుకారాం సినిమాల్లో నటనతో కన్నడ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్‌,  శోభన్ బాబు, చిరంజీవి చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ ‘ఇది కథకాదు’ సినిమాలో లీలావతి కనిపించారు. తమిళంలో జెమీనీ గణేషన్, కమల్ హాసన్, రజినీకాంత్‍తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆమె చివరి సినిమా 2009లో వచ్చిన 'యారదు'. 


ప్రముఖుల నివాళి
ఈమె 1999లో డాక్టర్ రాజ్‍కుమార్ జీవితసాఫల్య పురస్కారం, 2008లో తుముకూర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‍ను అందుకున్నారు. లీలావతి మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు షాక్ కు గురయ్యారు. స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఆమె నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. లీలావతి మరణంపై ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలంటూ ట్వీట్ చేశారు. 



Also Read: Lakshmika Sajeevan: విషాదం.. 24 ఏళ్లకే గుండెపోటుతో మలయాళ నటి మృతి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి