TOBY Movie Trailer: కన్నడ చిత్రపరిశ్రమలో చెప్పుకోదగ్గ దర్శకుల్లో రాజ్ బి శెట్టి (Raj B Shetty) ఒకరు. కన్నడ బ్లాక్ బస్టర్ గరుడ గమన వృషభ వాహన (Garuda Gamana Vrushaba Vahana) తీసింది ఈయనే. నటుడు కమ్ డైరెక్టర్ రాజ్ బి శెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా 'టోబి'(TOBY Movie). సిల్ అల్చలక్కల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీలో సంయుక్త హర్నాడ్, చైత్ర ఆచార్ హీరోయిన్లుగా నటించారు. ఇప్ప‌టికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వచ్చింది. కన్న‌డ ట్ర‌యో (TRIO) రక్షిత్ శెట్టి (Rakshit Shetty), రిషబ్ శెట్టి (Rishab Shetty), రాజ్ బి శెట్టిలు (Raj B shetty) ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''నేను బ‌లి ఇవ్వడానికి తెచ్చిన గొర్రె తప్పించుకుంది. ఆ బ‌లి ఇచ్చే గొర్రె తిరిగి ఊరిలోకి అడుగు పెట్టకూడదు. ఒకవేళ అది గ్రామంలోకి అడుగుపెట్టిందంటే అది ఇకపై గొర్రె కాదు. అది మారి (మృత్యుదేవత)గా మారిపోతుందంటూ'' ఆద్యంతం ట్రైల‌ర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో రాజ్ బి శెట్టి మూగవాడిగా నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇది ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల జరుపుకుంటుంది. ప్రస్తుతం కన్నడ భాషలోనే తీసిన ఈ సినిమాను రిలీజ్ టైమ్ నాటికి ఇతర భాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.  ఈ సినిమాను లైట‌ర్ బుద్ధ ఫిలిమ్స్, అగస్త్య ఫిలిమ్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగష్టు 25న విడుదల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. 



Also Read: సరికొత్త లోకంలోకి తీసుకెళ్లేలా ప్రభుదేవా 'వూల్ఫ్' టీజర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook