Kantara heroine Sapthami Gowda Touches Allu Aravind Feet: కన్నడలో రూపొందిన కాంతారా సినిమా తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటూ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగులో చెప్పుకోదగ్గ కలెక్షన్లు సాధించి హాట్ టాపిక్ గా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా శనివారం నాడు విడుదలవగా మొదటి రోజు రెండు కోట్ల పది లక్షలు సాధించింది, రెండవ రోజు రెండు కోట్ల 80 లక్షలు మూడవరోజు కోటి 90 లక్షలు,  నాలుగో రోజు కోటి 45 లక్షల మేర షేర్ వసూళ్లు సాధించడమే కాక నాలుగు రోజులకు కలిపి ఎనిమిది కోట్ల పాతిక లక్షలు వసూలు చేసింది. మొత్తంగా 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు బయ్యర్లకు ఎనలేని లాభాలు తెచ్చిపెట్టింది.


నిజానికి ఈ సినిమాని కేవలం రెండు కోట్ల రూపాయలకు గీతా ఆర్ట్స్ సంస్థ బయ్యర్లకు విక్రయించింది. డేటా రెండు కోట్ల 30 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఫిక్స్ చేశారు. అయితే ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాక ఐదు కోట్ల 95 లక్షలు సాధించి లాభాల్లో పయనిస్తోంది. ఇక ఈ ఫిగర్ మరింత పెరిగి డబల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించింది సినిమా యూనిట్. ఈ సక్సెస్ మీట్ కి సినిమా హీరో  రిషబ్ శెట్టి, హీరోయిన్ సప్తమి గౌడ సినిమాలో కీలక పాత్రలో నటించిన ప్రమోద్ శెట్టి హాజరయ్యారు.


ఇక ఇదే వేడుకకు హోంబలే ఫిలింస్ నుంచి కైకాల రామారావు, సినిమాని తెలుగులో కొన్ని విడుదల చేసిన గీత అధినేత అల్లు అరవింద్ వంటి వారు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఆశీర్వాదం తీసుకోవడం కోసం హీరోయిన్ ఆయన కాళ్లు అందుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన కాంతార సినిమా ఒక్క కన్నడ రాష్ట్రంలోనే సుమారు 80 కోట్ల దాకా వసూళ్లు తీసుకువచ్చింది. ఇక ఇతర భాషలలో కూడా విడుదల చేయడంతో సినిమా 150 కోట్ల మార్కు దాటినా ఆశ్చర్యం లేదనే అంచనాలు ఉన్నాయి.


Also Read: Bobby Deol in Pushpa 2: పుష్ప సినిమాలో బాలీవుడ్ స్టార్.. రచ్చ రేపుతున్న సుకుమార్ ప్లానింగ్!


Also Read: Urvashi Rautela on Rishabh Pant: రిషబ్ పంత్‌కి 'ఐ లవ్ యూ' చెప్పిన ఊర్వశి రౌతేలా.. అసలు విషయం బయటపెట్టిన హీరోయిన్! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook