Karan Johar Latest Comments సినిమాలు ఫ్లాప్ అయిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని వింటుంటాం. హిట్టైనా, ఫ్లాపైనా కూడా హీరోలు, దర్శకులు మాత్రం తమకు ఎంత కావాలో అంత తీసుకుంటారు. ఫ్లాపైనా కూడా హీరోలకు, దర్శకుల మీద ఎలాంటి ప్రభావం కనిపించదు. ఎటు తిరిగి నిర్మాతకే అన్ని కష్టాలు వస్తుంటాయి. హిట్టైనా కూడా నిర్మాతలకు లాభాలు రావని తాజాగా కరణ్‌ జోహార్ చెప్పుకొచ్చాడు. నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో తాజాగా వివరించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్‌ కల్ట్ క్లాసిక్ చిత్రాలను 90వ దశకంలో అందించిన కరణ్‌ జోహార్ ఈ కామెంట్లు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శక నిర్మాత అయిన కరణ్‌ జోహర్ మాత్రం నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో తాజాగా చెప్పుకొచ్చాడు. సినిమా హిట్టైనా కూడా వాటి లాభాల్లో యాభై శాతం హీరోలే తీసుకుంటారని, ఆ తరువాత దర్శకుడు తీసుకుంటాడని, ఆ తరువాత రైటర్ చేతికి వెళ్తాయని చెప్పుకొచ్చాడు. అలా తమ వరకు రూపాయి కూడా రాదన్నట్టుగా కరణ్ జోహర్ తన ఆవేదన వెల్లగక్కాడు.


ప్రస్తుతం బాలీవుడ్ దర్శక నిర్మాతల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ సినిమాలను నార్త్ ఆడియెన్స్ తిప్పి కొడుతున్నారు. గత ఏడాది వచ్చిన పెద్ద హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. అక్షయ్ కుమార్ సినిమాలన్నీ ఫ్లాపుగా మిగిలాయి. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కూడా దారుణంగా బెడిసి కొట్టేసింది. ఒక్క బ్రహ్మాస్త్ర పర్వాలేదనిపించిందగా.. అజయ్ దేవగణ్ దృశ్యం 2 మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి.


అలా గత ఏడాది బాలీవుడ్ మొత్తానికి ఓ పీడకలలా జరిగింది. మరి ఈ ఏడాది సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి వారు బరిలోకి దిగబోతోన్నారు. పఠాన్ సినిమాతో బాలీవుడ్ భవిష్యత్ ఎలా ఉండబోతోందో తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఇటు షారుఖ్, అటు బాలీవుడ్ పరిస్థితి కాస్త మెరుగు పడినట్టే.


Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?


Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి