Karate Kalyani Face To Face: జీ తెలుగు న్యూస్‌తో కరాటే కళ్యాణి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ వీడియో
Karate Kalyani Exclusive Interview: కరాటే కళ్యాణి చిన్న పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటోందంటూ వచ్చిన సంచలన ఆరోపణలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కరాటే కళ్యాణి పిల్లలను విక్రయిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు, చైల్డ్ లైన్ వెల్ఫేర్ సిబ్బంది ఆమె ఇంట్లో రైడింగ్ చేశారనే వార్తలు ఫిలింనగర్ లో మరింత సంచలనం సృష్టించాయి.
Karate Kalyani Exclusive Interview: కరాటే కళ్యాణి చిన్న పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటోందంటూ వచ్చిన సంచలన ఆరోపణలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కరాటే కళ్యాణి పిల్లలను విక్రయిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు, చైల్డ్ లైన్ వెల్ఫేర్ సిబ్బంది ఆమె ఇంట్లో రైడింగ్ చేశారనే వార్తలు ఫిలింనగర్ లో మరింత సంచలనం సృష్టించాయి. అంతేకాకుండా ఈ విషయం బయటికి పొక్కడంతో కరాటే కళ్యాణి ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయిందనే వార్తల నేపథ్యంలో ఆమె తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. మీడియాలో ఆరోపణలు వస్తున్నట్టుగా తాను పిల్లలను అమ్ముకునేంత నీచ స్థితికి దిగజారలేదన్న ఆమె.. తానంటే గిట్టని వారే తనపై ఈ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రకు తెరలేపింది ఎవరనే వివరాలు తర్వాత వెల్లడిస్తానన్న కరాటే కళ్యాణి.. ముందుగా తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పడానికే మీడియా ముందుకొచ్చానని అన్నారు.
కరాటే కళ్యాణి ప్రెస్ మీట్ సందర్భంగా ఆమె జీ తెలుగు న్యూస్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్న పిల్లల విక్రయం, దత్తత వివాదం, తన నివాసంలో పోలీసుల రైడింగ్, శ్రీకాంత్ రెడ్డిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇంతకీ కరాటే కల్యాణి (Karate Kalyani about Srikanth Reddy) ఏం చెప్పారో ఆమె మాటల్లోనే మీరే చూడండి.
Also read : KARATE KALYANI PRESS MEET : 'కరాటే కల్యాణి పారిపోదు.. పరిగెత్తిస్తది'
Also read : Varshini About Srikanth Reddy: కరాటే కళ్యాణి vs శ్రీకాంత్ రెడ్డి వివాదంలో వర్షిణి వెర్షన్ ఏంటి ?
Also read : Karate Kalyani vs Srikanth Reddy: కరాటే కళ్యాణి వీడియోలే మరీ హాట్ అంటున్న శ్రీకాంత్ రెడ్డితో ఫేస్ టు ఫేస్
Also read : Karate Kalyani: మరో వివాదంలో కరాటే కల్యాణి... ఆమెతో ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు మరో వ్యక్తి ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook