Karate Kalyani Reaction : అమ్మాయిలను ఎక్కడెక్కడో టచ్‌ చేస్తూ ప్రాంక్ విడియోలా..

Karate Kalyani Reaction : అమ్మాయిలను ఎక్కడెక్కడో టచ్‌ చేస్తూ  ప్రాంక్ విడియోలా..

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 07:00 PM IST
  • Karate Kalyani Reaction : అమ్మాయిలను ఎక్కడెక్కడో టచ్‌ చేస్తూ ప్రాంక్ విడియోలా.. రాజకీయ నేతలకు అమ్మాయిలను పంపే బ్రోకర్ అంటూ శ్రీకాంత్‌ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలాంటి వాళ్లను, పిచ్చి విడియోలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది.
Karate Kalyani Reaction : అమ్మాయిలను ఎక్కడెక్కడో టచ్‌ చేస్తూ  ప్రాంక్ విడియోలా..

Karate Kalyani Reaction : ఓ బాధితురాలు తనతో చేసిన వీడియోలు శ్రీకాంత్‌రెడ్డి నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానెల్‌లోంచి డిలిట్ చేయించాలని తనను కోరిందని, అందుకే శ్రీకాంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లానని కరాటే కల్యాణి తెలిపింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి ఛానెయ్ మూయించి వెంటనే అతని ఛానెల్ మూసేయించాలని.. అడల్ట్, పోర్న్ కంటెంట్ తొలగించటం పట్ల తనకెంత  బాధ్యత ఉందో.. సమాజంలోని ప్రతి ఒక్కరికీ అంతే బాధ్యత ఉందని కరాటే కల్యాణి పేర్కొంది.

మీడియా అంతా శ్రీకాంత్‌రెడ్డి ఏం చేస్తున్నాడో, అమ్మాయిలతో ఎలాంటి విడియోలు తీస్తున్నాడో చూపించాలని కోరింది. కొంత మంది అమ్మాయిలు, తల్లిదండ్రులు విడియోలపై తనకు కాల్ చేసి ఫిర్యాదు చేశారని, ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో తనకు పోస్టులు చేశారని తెలిపింది కల్యాణి. గతంలో పట్టించుకోలేదని, కానీ ఇటీవల ఓ 2-3 విడియోలు పంపారని, అవి మరీ దారుణంగా ఉన్నాయని కల్యాణి ఆరోపించారు. 

ఓ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వేధిస్తున్నాడక్కా అని ఫిర్యాదు చేశారని పేర్కొంది. డబ్బులివ్వకుండా.. వాళ్ల దగ్గరికి వీళ్ల దగ్గరికీ పొమ్మంటాడని తనకు ఫిర్యాదు చేశారంది కల్యాణి. 

తన తమ్ముడి ఇల్లు కూడా అదే ఏరియాలో ఉంటుందని, ఓ సారి వెళ్తుంటే.. ప్రాంక్ విడియో ఛానెల్ నిర్వాహకుడు శ్రీకాంత్‌ రెడ్డి ఇక్కడే ఉంటాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసిందని, ఆ కారణంగానే మర్యాదగానే అడుగుదామని వెళ్లామని, ఇంట్లోకి కూడా వెళ్లలేదని, బయటికి పిలిచి మాట్లాడదామని కిందికి దిగిరా అంటే..  పై నుంచి నోటికొచ్చినట్లు మాట్లాడి తనపై దాడి చేశాడని వాపోయింది.

బూతులు మాట్లాడితేనే ఫేమస్ అవుతారని విడియోలు తీసి.. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని ఆరోపించింది కల్యాణి. మంచి మంచి ఇంటర్వ్యూలు చేయండి ఫేమస్ అవుతారన చెప్పటంపోయి.. నేరుగా బూతులు మాట్లాడితేనే ఫేమస్ అవుతారని చెప్తాడని అమ్మాయిలు చెప్పారని ఆరోపించింది.

తన దగ్గరికి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వచ్చి శ్రీకాంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారని, ఫేస్‌బుక్‌లోనూ ఇలాంటి అంశాలపై పోరాటం చేయాలని తల్లిదండ్రులు కోరతారంది. ఓ అమ్మాయి తన విడియోలు డిలీట్ చేయించాలని తనను కోరినందుకే శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లానని  కరాటే కల్యాణి స్పష్టంచేసింది.

అసలు చాలా మందికి తన సొంత డబ్బులిస్తానని, అలాంటిది తనపై డబ్బులడిగాననే ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా అనిపిస్తోందని కరాటే కల్యాణి ఆరోపించింది. తనను ఇవన్నీ నీకెందుకమ్మా.. ప్రశాంతంగా ఊరికొచ్చెయ్ అని అంటుంటారని, కానీ సమాజం పట్ల బాధ్యతతో ఉండాలనే తాను ముందుంటానని స్పష్టం చేసింది. తనను డబ్బులిస్తా రా... అన్నాడని.. అలా అంటే ఏ మహిళకైనా కోపం వస్తుందని, అందుకే కొడతానని చెప్పి.. రెండు పీకానని కరాటే కల్యాణి  చెప్పింది.

ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావొద్దని, మహిళలకు రక్షణ ఉండాలంటే బూతు ప్రాంక్ వీడియోలన్నీ బ్యాన్ చేయాలని కరాటే కల్యాణి డిమాండ్ చేశారు.

అతను చేసిన తప్పు శ్రీకాంత్‌కు అర్ధమైనందునే.. చాలా పెద్ద కేసు అవుతుందని భయంతోనే తప్పించుకోవటానికే తనపై డబ్బులడిగానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కల్యాణి ఆరోపించింది. తాను మోస పోయింది తప్ప, తాను ఇంత వరకు ఎవరినీ మోసం చేయలేదని వాపోయింది. భారత స్త్రీగా నా పిల్లలు చెడిపోతున్నారని నేను కన్నీళ్లు పెట్టాలా అంటూ కన్నీరు పెట్టుకుంది కల్యాణి. తన ఒళ్లో కూతురుందని కూడా చూడకుండా తనపై దాడి చేశాడని బోరున విలపించింది. వాడక్కతో చెల్లితో ఇలానే ప్రాంక్స్ చేస్తాడా.. అని ప్రశ్నించింది. ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిలకు ఇలాంటి బూతు ప్రాంక్స్ చేస్తే ఫేమస్ అవుతారు.. బిగ్‌బాస్‌కు వెళ్తారు అంటూ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. బొడ్డులో చేతులు పెట్టి, ఎక్కడబడితే అక్కడ నొక్కుకుంటూ అడల్ట్‌ కంటెంట్‌ను ప్రాంక్ విడియో అంటుంటే ఒక ఆడదిగా ఊరుకోవాలని అనిపించలేదని కల్యాణి స్పష్టం చేసింది. పొట్ట కూటి కోసం, పిచ్చి ముండలు అన్నీ చేయించుకుంటుంటే.. వాళ్లతో విడియోలు చేసి అమ్ముకుని బతికే శ్రీకాంత్‌ రెడ్డి.. తనను రమ్మంటే ఊరుకునేది లేదని, ఎందాకైనా పోరాటం చేస్తానని స్పష్టం చేసింది.

నేను పులివెందుల రెడ్డిని. నువ్వు బయట ఎలా తిరుగుతావో చూస్తానని శ్రీకాంత్ రెడ్డి బెదిరించాడని ఆరోపించింది కల్యాణి. శ్రీకాంత్ రెడ్డి పరమ 420అని వ్యాఖ్యానించింది. తాను డబ్బులు అడిగానని ఏ ఆధారాలున్నా తీసుకు రావాలని సవాల్ చేసింది. అన్యాయం ఎక్కడుంటే అక్కడ కల్యాణి ఉంటుందని పేర్కొంది. కరోనా వేవ్స్‌లో ఎంతో మందికి సాయం చేశానని కల్యాణి వివరించింది.

రాజకీయ నేతలకు అమ్మాయిలను పంపే బ్రోకర్ అంటూ శ్రీకాంత్‌ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలాంటి వాళ్లను, పిచ్చి విడియోలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. తన ప్రయత్నం తాను చేశానని.. తనకు సమాజంలో ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ఇలాంటి ప్రాంక్ విడియో ఛానెళ్లను నిషేధించే వరకు పోరాటం చేస్తానని కల్యాణి స్పష్టంచేశారు.

Also Read - Kangana Ranaut: మహేశ్‌ బాబు చెప్పింది నిజమే.. కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు: కంగనా రనౌత్

Also Read - Ketika Sharma Photos: కళ్లతోనే కుర్రకాళ్ల మనసును కొల్లగొడుతోందీ ఢిల్లీ భామ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News