Karimnagars Most Wanted: కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్.. రూరల్ మాఫియా అదరగొట్టిందా..?
Karimnagars Most Wanted Review: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త వాళ్లకు అవకాశాలు చాలా వస్తున్నాయి. అలా కొత్త వాళ్లను ప్రోత్సహిస్తూ తీసిని వెబ్ సిరీస్ `కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్`. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?
Karimnagars Most Wanted Review: నటీనటులు: సాయి సూరేపల్లి, అమన్ సూరేపల్లి, అనిరుధ్ తుకుంట్ల, గోపాల్ మాదారం, శ్రీవర్ధన్, మహేష్ రవుల్, రాకేష్ రాచకొండ తదితరులు
నిర్మాతలు: స్ట్రీట్ బీట్జ్ సినిమా
దర్శకత్వం: బాలాజీ భువనగిరి
నేపథ్య సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్
సంగీతం: సాహిత్య సాగర్
సినిమాటోగ్రఫీ: సంకీర్త్ రాహుల్ మాచినేని
విడుదల తేదీ:
ఓటీటీలు వచ్చిన తర్వాత యంగ్ & టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు చక్కని ఛాన్సులు వస్తున్నాయి. కొత్తవాళ్ళను, తెలుగు వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఓ అడుగు ముందుండే ఆహా ఓటీటీలో విడుదలైన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్'. లోకల్ పాలిటిక్స్, మాఫియా నేపథ్యంలో తీసిన ఈ సిరీస్ ఎలా ఉంది? టాక్ ఏంటనేది? ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి?
గని (సాయి సూరేపల్లి)ది కరీంనగర్. బిజినెస్ చేయడానికి లోన్ కోసం అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది. అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన సలహాతో బ్రదర్ టింకు (అమన్ సూరేపల్లి), స్నేహితులు బిట్టు (అనిరుధ్ తుకుంట్ల), సత్తి (గోపాల్ మాదారం)తో కలిసి లోన్ రికవరీ వర్క్ స్టార్ట్ చేస్తారు. మనీ రెడీ చేసుకునే సమయానికి పెద్ద నోట్లను రద్దు చేస్తారు. డీమానిటైజేషన్ టైంలో మరణించిన వ్యక్తుల పేరుపై అకౌంట్స్ ఓపెన్ చేసి తమ 30 లక్షలను రూ. 2000 నోట్లగా మార్చుకుంటారు. తర్వాత రాత్రికి రాత్రి ఆ బ్యాంకు అకౌంట్స్ నుంచి రూ.5 కోట్లు మారతాయి. దాంతో గని, స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ ఐదు కోట్ల రూపాయలను మార్చింది ఎవరు? గనిని కేసులో ఇరికించింది ఎవరు? జైలు నుంచి బయటకు వచ్చిన గని కరీంనగర్ మాఫియాగా ఎలా ఎదిగాడు? ఎమ్మెల్యే పురుషోత్తం (శ్రీవర్థన్)తో గని స్నేహం, విరోధం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉంది?
వెబ్ సిరీస్ స్టార్టింగ్ సాధారణంగా ఉంది. క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శక రచయితలు కాస్త టైం తీసుకున్నారు. హీరోలను కాకుండా బ్యాంకు మేనేజర్ ను ఎందుకు ఎక్కువ సేపు చూపిస్తున్నారని బోర్ కొట్టొచ్చు. అయితే, నలుగురు స్నేహితులను జైలు పంపాక అసలు స్కెచ్ తెలుస్తుంది. క్యారెక్టర్స్ డిటైలింగ్ మీద వర్క్ చేసినట్లు అర్థం అవుతుంది.
మాఫియా, గ్యాంగ్‌స్టర్ కథలు అనేసరికి సిటీ బేస్డ్, ఫారిన్ బ్యాక్ డ్రాప్ మీద దర్శక రచయితలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. లోకల్ ఫ్లేవర్ చూపించడం 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్' స్పెషాలిటీ. దర్శకుడు బాలాజీ భువనగిరిది కరీంనగర్ కానప్పటికీ... కరీంనగర్ ఆత్మను తెరపై అందంగా ఆవిష్కరించారు. నటీనటుల నుంచి చక్కటి ప్రతిభ రాబట్టుకున్నారు. బలగం రైటర్ రమేష్ ఎలిగేటి ఈసారి మాఫియా కథతో మనల్ని సర్ప్రైజ్ చేశారు.
క్యారెక్టర్లను చూస్తుంటే రెగ్యులర్‌గా మన చుట్టుపక్కల ఇంత జరుగుతుందా? అనిపిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాల లెంగ్త్ ఎక్కువ ఉందని అనిపించినప్పటికీ అసలు కథ పక్కన పెట్టేసి మరోవైపుకు వెళ్లకుండా సిన్సియర్ అటెంప్ట్ చేసిన టీంను అభినందించవచ్చు. ప్రొడక్షన్ క్వాలిటీ బావుంది.
ఎవరెలా చేశారు?
నటీనటులు అందరూ కొత్తవాళ్లు అయినప్పటికీ... సీజనల్ యాక్టర్స్ తరహాలో అద్భుతంగా నటించారు. కరీంనగర్ యాస, ఆ స్టైల్ బాగా చూపించారు. వాళ్ళ యాక్టింగ్ రియలిస్టిక్ గా ఉంది.
మెయిన్ లీడ్ చేసిన సాయి సూరేపల్లికి ఓటీటీ ఎంట్రీ ఇది. ఫస్ట్ వెబ్ సిరీస్‌తోనే నటుడిగా హిట్ కొట్టేశాడు. క్యారెక్టర్ పరిధి మేరకు సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. జైలుకు వెళ్ళడానికి ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత... గెటప్, యాక్టింగ్ పరంగా వేరియేషన్ చూపించాడు. అమన్, అనిరుధ్, గోపాల్ చక్కగా నటించారు. ఎమ్మెల్యే పురుషోత్తంగా శ్రీవర్ధన్ పర్వాలేదు. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ విషయాలకు వస్తే... 'కరీంనగర్ మోస్ట్ వాంటెడ్'కు కథ అందించిన 'బలగం' రైటర్ రమేష్ ఎలిగేటి, దర్శకుడు బాలాజీ భువనగిరిని మెచ్చుకోవాలి. కరీంనగర్ టౌన్ వాతావరణాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించారు. డైలాగుల్లో తెలంగాణ డైలెక్ట్ వినిపించింది. క్యారెక్టర్లను బాగా డిజైన్ చేశారు. కరీంనగర్ బ్యాక్ డ్రాప్ మిస్ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సిరీస్ తీసిన బాలాజీ భువనగిరి పనితనం పలు సన్నివేశాల్లో కనిపించింది. కొత్త నటీనటుల నుంచి చక్కని నటన రాబట్టుకున్నారు. ఉన్నంతలో సిరీస్ బాగా తీశారు. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్'. బలమైన కంటెంట్ ఉంటే చిన్న పట్టణాల నేపథ్యంలో కూడా సిరీస్ తీయవచ్చు అని నిరూపించే వెబ్ సిరీస్ ఇది. ఓవరాల్ గా చెప్పుకుంటే... రూరల్ బ్యాక్‌డ్రాప్ మాఫియా వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్లకు 'కరీంనగర్ మోస్ట్ వాంటెడ్' బెస్ట్ ఆప్షన్!
రేటింగ్: 2.75
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter