Karthi Sardar Movie Telugu Review: సూర్య తమ్ముడుగానే తమిళ ప్రేక్షకులకు పరిచయమైన కార్తి తర్వాతి కాలంలో స్టార్ హీరో అనిపించుకున్నాడు. కేవలం తమిళ ప్రేక్షకులకు వినోదం అందించడమే గాక తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. సూర్య లాగానే కార్తి చేస్తున్న దాదాపు అన్ని తమిళ్ సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపద్యంలో ఈ శుక్రవారం సర్దార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. ఈ సినిమాకు సస్పెన్స్ థ్రిల్లర్స్ తెరకేక్కిస్తాడని పేరు ఉన్న పీఎస్ మిత్రన్ డైరెక్టర్ కావడం, ఈ సినిమాలో కార్తీ అనేక గెటప్పులు వేసాడు అంటూ ప్రచారం జరగడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాల ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్లు సినిమా మీద ఏర్పడిన అంచనాలను మరింత పెంచాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంది. అనేది సినిమా రివ్యూలో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సర్దార్ కథ ఏమిటంటే?
మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఏజెంట్ గా పనిచేసే సర్దార్(కార్తీ) ఇండియన్ డిఫెన్స్ సలహాదారుని దారుణంగా చంపేయడంతో దేశ ద్రోహిగా ప్రకటించబడతాడు. ఈ నేపథ్యంలో సర్దార్ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే సర్దార్ కొడుకు విజయ్ ప్రకాష్(కార్తీ) మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్లో మెరిక లాంటి ఒక ఇన్స్పెక్టర్గా ఎదుగుతాడు. అయినా సరే తన తండ్రి దేశద్రోహి అనే మరక అతనికి పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే అనూహ్య పరిస్థితుల్లో దేశద్రోహిగా బాంగ్లాదేశ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సర్దార్ తిరిగి వస్తాడు. తిరిగి భారతదేశానికి రావడానికి రాథోడ్(చుంకీ పాండే) పాత్ర ఏమిటి? నిద్రలేస్తే తన తండ్రిని తిట్టుకోకుండా ఉండలేని విజయ్ ప్రకాష్ కి తన తండ్రి గురించిన నిజం ఎలా తెలుస్తుంది? చివరికి సర్దార్ ఇండియా వచ్చిన పని పూర్తి చేశాడా ? సర్దార్ - విజయ్ ప్రకాష్ ఇద్దరూ కలుస్తారా? అనేది సినిమా కథ.


విశ్లేషణ:
సాధారణంగానే పిఎస్ మిత్రన్ సినిమాలు మిలిటరీ, పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్, కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న లొసుగులు వంటి వాటిని బట్టబయలు చేసే విధంగా ఉంటాయి. ఆయన గత సినిమాలు చూస్తే ఇదే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని మరోసారి తేటతెల్లం చేసే ప్రయత్నం చేశాడు పిఎస్ మిత్రన్. మినరల్ వాటర్ బాటిల్స్ మార్కెటింగ్ వ్యవహారాన్ని కథాంశంగా తీసుకుని దానికి మిలిటరీ, మిలిటరీ ఇంటెలిజెన్స్, అందులో పని చేసే వ్యక్తులు కుటుంబాల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు అనే అంశాలను మిళితం చేస్తూ హృదయానికి హత్తుకునే విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. సినిమా ఫస్టాఫ్ పూర్తయినా సినిమా మీద  పూర్తి అవగాహన రాదు కానీ సెకండ్ హాఫ్ పూర్తయిన తర్వాత ప్రేక్షకులు కథను కథ నేరెట్ చేసిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఎక్కడికక్కడ అన్ని విభాగాలు కలిసి పనిచేయడంతో ఎలాంటి వంకా పెట్టకుండా సినిమా పూర్తిస్థాయిలో తెర మీదకు వచ్చిందని చెప్పచ్చు. 


నటీనటుల విషయానికి వస్తే 
ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ ఈ సినిమాలో మరోసారి తనకు బాగా అచ్చొచ్చిన పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. ద్విపాత్రాభినయం కావడంతో ముదుసలి పాత్రలో కొన్ని సీన్లలో ఎబెట్టుగా అనిపించినా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసి దాదాపుగా సఫలం అయ్యాడు. ఇక హీరోయిన్లు రజిష విజయన్, రాశిఖన్నా ఇద్దరికీ చాలా చిన్న పాత్రలే అయినా తమ పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు. అనన్య పాండే తండ్రి చుంకీ పాండే తనదైన స్టైల్ విలనిజం పండించి మంచి మార్కులు సంపాదించాడు. ఇక మిగతా పాత్రధారులు ఎవరికి వారు తమ పాత్రల పరిధి మీద నటించారు.


టెక్నికల్ టీం
టెక్నికల్ టీం వర్క్ విషయానికి వస్తే ఈ సినిమా కథ- కథనం విషయంలో పీఎస్ మిత్రన్ మార్క్ ఆద్యంతం కనిపించింది. ఎక్కడా కూడా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా కథనాన్ని నడిపించడంలో పీఎస్ మిత్రన్ సఫలమయ్యాడు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కొన్ని పాటల వరకు బాగా సెట్ అయింది అలాగే నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది, ఒకరకంగా అదే సినిమాను మరో లెవల్ కు తీసుకు వెళ్లింది అని చెప్పక తప్పదు. అలాగే ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. నిర్మాణం విలువలు సినిమాకు తగినట్లుగా ఉన్నాయి


ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
ఈ సినిమా దీపావళికి ఒక మంచి విందు భోజనం లాంటిది. యాక్షన్, ఎమోషన్స్, సెంటిమెంట్, కామెడీ సమపాళ్లలో వెస్ ఒక పర్ఫెక్ట్ విందు భోజనంలా సిద్ధం చేశారు. దీపావళికి కుటుంబంతో కలిసి హ్యాపీగా చూసేయ దగిన సినిమా ఇది.


Rating: 3/5


Also Read:  Prince Movie Review : ప్రిన్స్ రివ్యూ.. లాజిక్‌లకు ఆమడదూరం


Also Read:  Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ.. ట్రోలర్‌లకు మంచు విష్ణు కౌంటర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook