Karthika Deepam 2: జ్యోత్స్స వీపు వాయించడానికి చీపురు తిరగేసిన దీప.. ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెస్తా అని ఊరెళ్లిపోయిన అనసూయ..
Karthika Deepam 2 Today December 26th Episode: ఇక శౌర్య ఇంట్లో ఇవి లేవు, అవి లేవు అని మారం చేస్తుంది. రౌడీ ఇలా రోజు కింద కూర్చొని భోజనం చేస్తే మంచిదంట అంటాడు కార్తీక్. అమ్మ పప్పు వేశావు కానీ, ఫ్రై, అప్పడాలు, పికిల్ కూడా వేయలేవు అంటుంది శౌర్య. అన్నీ ఉన్నాయ్ నేను తినిపిస్తా కళ్లు మూసుకో ఇది పప్పు ముద్ద అని తినిపిస్తాడు..
Karthika Deepam 2 Today December 26th Episode: ఇక ఒక్కో బుక్క అన్నం తినిపిస్తూ పప్పు, పచ్చడి, ఫ్రై ముద్ద అని చెబుతూ ఉంటాడు. శౌర్య మీద కన్నతల్లికి మించిన ప్రేమ చూపిస్తాన్నారు బాబు అని మనసులో దీప ఏడుస్తుంది. ఇక ఎలా ఉంది అంటాడు కార్తీక్. బాగుంది రోజూ ఇలాగే తిందాం అంటాడు. కాంచన, దీపలు కన్నీటి పర్యంతమవుతారు. అనసూయ కూడా వారిని చూసి బాధపడుతుంది.
తెల్లవారుతుంది. అనసూయ కాంచన వద్దకు వస్తుంది. ఏంటక్క నిన్ను చూస్తే ఎక్కడికో వెళ్తున్నట్లు అనిపిస్తుంది అంటుంది కాంచన. నేను మా ఊరు వెళ్తున్నా అంటుంది. రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నా బరువు తగ్గించడానికి వెళ్తున్న చెల్లెమ్మ అంటుంది. ఊరెళ్లి దీప పేరు మీద ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకువస్తా అంటుంది. దీపకు చెప్పకుండా నీతో మాత్రం చెప్పి వెళ్తున్నా అంటుంది. నువ్వు వెళ్లడం నాకు కూడా ఇష్టం లేదు అంటుంది కాంచన. దాని మంచి చెడు చూడాలి కదా చెల్లెమ్మ వెళ్లొస్తా అంటుంది.
పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కట్టుకుందామని కొన్నా నీకు నచ్చితే కట్టుకోమ్మా.. అంటుంది. నీ దగ్గర ఏం లేకున్నా నాకు ఇవ్వాలని చూస్తున్నావ్ నీది గొప్ప మనస్సు అక్క అని ఏడుస్తుంది కాంచన. మళ్లీ దీప వస్తే నన్ను వెళ్ల నివ్వదు అని వెళ్లిపోతుంది అనసూయ. మనకు మంచి రోజులు వస్తాయి అక్క కాస్త ఓపిక పట్టాలి అంటుంది కాంచన.
ఇక కార్తీక్ దీపను అద్దం పట్టుకోమంటాడు. ఓ బ్యాగ్రౌండ్ సాంగ్ వేస్తారు. అద్దంలో చూడండి కార్తీక్ బాబు అంటుంది దీప. నీకళ్లలో కనిపిస్తుంది దీప అంటాడు. నాకు తెలిసిన రెండు కంపెనీలు ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో జాబ్ వెతుక్కోవడానికి వెళ్తా ఈవినింగ్ చాక్లెట్ తెస్తా అని చెప్పు జాబ్ వస్తుంది కదా అంటాడు. ఎలా వెళ్తారు అంటే కాళ్లు, ఆటో లేదా ఆర్టీసీ బస్సు ఉంది ఖర్చుపెట్టడానికి మా ఆవిడ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి అంటాడు.
అన్ని ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. ఏవీ లేనప్పుడు తక్కువ మందే ఉంటారు. మీరు బాగా నచ్చారు బాబు అంటుంది. అలా చెబితే ఇంకాస్త దగ్గరవుతా అంటాడు. అమ్మ నేను వెళ్లి వస్తా అంటాడు. దీప నువ్వు ఎదురు రా అంటుంది కాంచన. అనసూయ గారు ఏరి? అంటాడు. ఊళ్లో ఏదో పని ఉంది అని వెళ్లింది అంటుంది కాంచన. మనకు భారంగా ఉండకూడదని తను వెళ్లిపోయినట్లుంది అంటుంది దీప. అలా ఏం కాదు అంటుంది కాంచన. నువ్వు ముందుగా వాడికి ఎదురు రా.. అంటుంది. నేను ఎదురు వస్తే ఇంకా మంచిది బావ.. అని ఎంట్రీ ఇస్తుంది జ్యోత్స్న.
వీళ్లు ఎలా బతుకుతున్నారా? అని మీ తాతయ్య పంపించాడా? అంటాడు కార్తీక్ ఏమి తెలియనట్లు పలకరిస్తున్నావ్ అంటాడు కార్తీక్. మీ కష్టాలు చూసి ఆనందించడానికి రాలేదు. గ్రానీకి దాసుగారు చెబితే గ్రానీ నాకు చెప్పింది అంతే.. వెంటనే పరుగెత్తుకుని వచ్చా అంటుంది జ్యోత్స్న. మరి బయట కారుందే అని వెటకారం చేస్తాడు కార్తీక్. కారులోనే వచ్చాను బావ. నేను సీరియస్ మాట్లాడితే నేను జోక్‌గా ఉందా? మీరు వెళ్లిపోయారని తెలిసి మమ్మీ ఏడ్చింది, నేను భోజనం చేయలేదు అంటుంది జ్యోత్స్న.
ఇదీ చదవండి: అస్సలు చెక్ ఇచ్చిందే కావ్య..! రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది, ఆసుపత్రి బిల్లు కూడా కట్టలేదేంటని నిలదీసిన అపర్ణ..!
ముందు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు అంటాడు. ఇలాంటి ఇంట్లో నువ్వు ఎందుకు ఉంటావు బావకు నువ్వైనా చెప్పు అత్త అంటుంది. అయినా ఫర్వలేదు తాతయ్య ఓడిపోయాడని నేను తాతతో చెప్పిస్తా అంటుంది జ్యోత్స్న. మనవరాలు చెప్పిందనో, మనవడు పోయాడనో మీ తాత మారడు. మేం కూడా ఏం కోరుకోవట్లేదు. కష్టమో, నష్టమో మేం బతుకుతాం. నువ్వు బయలు దేరు అంటాడు. నేను వెళ్లను బావ అంటుంది. దీప నేను జాబ్ కు వెళ్తున్నా వచ్చేలోపు ఇల్లు శుభ్రం చేయి పసుపునీళ్లు చల్లు, గుమ్మడికాయ కూడా కట్టు అంటాడు.
చూశావా అత్త.. మరదలు అని చూడకుండా మీ కొడుకు వంటమనిషి ముందు ఎలా అవమానించాడు. నువ్వు మారవ జ్యోత్స్న. వదినను అడిగా అని చెప్పు అని వెళ్లిపోతుంది కాంచన. పది మందికి ఉద్యోగం ఇచ్చే మా బావ ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్లాడు దరిద్రులతో స్నేహం చేస్తే మనం కూడా దరిద్రులం అవుతామంటే మా బావ ఏకంగా నీ మెడలో తాళి కట్టాడు. నువ్వు వీరిని పూర్తిగా నాశనం చేసేవరకు నువ్వ వదిలిపెట్టవు. ఇప్పటికైనా ఆలోచించు నువ్వు అడిగినంత డబ్బు ఇస్తా. మా బావ ను వదిలిపెట్టు నీ మొగుడు నాకు కావాలి. దీని కోసం నేను ఏదైనా చేస్తా. నువ్వు మా బావను భర్తలా చూడట్లేదు కదా అంటుంది జ్యోత్స్న.
ఇదీ చదవండి: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆ 10 రోజులు వారికి నో ఎంట్రీ..!
పెళ్లి చేసుకుంది కాపురం చేయడానికి కాదు. కలిసి బతకడానికి కాదు అంటుంది జ్యోత్స్న. నువ్వెవరు అంటే నీ మొగుడికి ముందు పెళ్లాన్ని నువ్వు మధ్యలో వచ్చి తగులుకున్నావ్. మా బావకు పెళ్లాన్ని అయిపోయానని తెగ ఫీలవుతున్నావేమో. నేను తలుచుకుంటే నిన్ను ఆ బావ నుంచి విడగొట్టి ఊరుకు పారిపోయేలా చేస్తా తలుచుకోనా? అని ఆర్డర్ వేస్తుంది జ్యోత్స్న. అప్పుడు దీప చీపురు పట్టుకొచ్చి తలుచుకోవే, నీలాంటి దానికి నోరు కాదు చీపురు కట్ట తిరగేసి వీపు వాయిస్తా అంటుంది దీప. సారీ దీప నేను ఆవేశంలో అన్న అంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న నేను కొడితే వెనక రెండు మూడు తరాలు దిగివస్తాయి. శాంత మూర్తిలా కనిపించానని చిందులు వేస్తే నాలో అమ్మోరు కనిపిస్తుంది. ఆ తర్వాత పోలేరమ్మ జాతరే.. నోరు అదుపులో పెట్టుకుని బయలు దేరు అని అరుస్తుంది దీప. వెంటనే వెళ్లిపోతుంది. ఒసేయ్ దీప నిన్న మాములుగా పంపించను ముందు బావ సంగతి తేలుస్తా అని కారులో వెళ్లిపోతుంది జ్యోత్స్న.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.