Karthika Deepam Today December 16th Episode:  క్యాబిన్‌కు వస్తాడు కార్తీక్‌. వాట్‌ మిస్టర్‌ కార్తీక్‌ అంటాడు. నేను క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ మీద సైన్‌ చేయలేదు. ఆ తర్వాతే కదా మీరు అప్రూవ్‌ చేయాలి. కానీ, నా సైన్‌ లేకుండా సీఈఓ వరకు వెళ్లింది కారణం ఏంటి అంటాడు. లుక్‌ మిస్టర్‌ కార్తీక్‌ ఛైర్మన్‌గా నేను డిసిషన్‌ తీసుకున్నాకా నీ సంతకానికి విలువ లేదు అంటాడు తాతగారు. మన క్వాలిటీ అవతల వారు మెయిటైన్‌ చేయగలరా లేదా? వంద రకాలుగా టెస్ట్‌ చేయాలి సంతకం అంటే గీతలు గీయడం కదా అంటాడు కార్తీక్‌.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేను మన బిజినెస్‌ కోసం లండన్‌లో కల్నరీ చేశా. నా పాఠాలే నాకు చెబుతున్నావా? అంటాడు తాతయ్య. అన్ని మీరే చేసినప్పుడు నాకు ఈ పోస్ట్‌ ఎందుకు కంపెనీ విలువ పడిపోతుంది అంటాడు కార్తీక్‌. నా సలహాలు లేనిచోట నేను ఉండను. నేను వర్క్‌ చేయలేను కంపెనీ రూల్‌ ప్రకారం నోటీస్‌ ఇచ్చి వెళ్లిపోతా అంటాడు కర్తీక్‌. ఈక్షణమే వెళ్లు అంటాడు తాతగారు. తాతా.. అంటుంది జోత్స్య.. ఏదో నీవళ్లనే మా హోటల్స్‌ రన్‌ అవుతున్నట్లు మాట్లాడుతున్నావ్. పొమ్మని నేను అనను.. పోతా అంటే నేను ఆపను అంటాడు తాతగారు.


అప్పుడే దీప భోజనం తీసుకుని వస్తుంది. రెండు నిమిషాలు ఆగు దీప వెంటనే వస్తా అని క్యాబిన్‌ కు వెళ్తాడు. అప్పుడే జ్యోత్స్న తాతకు బావకు మాట మాట పెరిగింది. నువ్వు వచ్చాకే మాకు గొడవలు జరిగాయి అంటుంది జ్యోత్స్న దీపతో.. రిజైన్‌ లెట్టర్‌ రెడీ చేసుకుని వస్తాడు కార్తీక్‌. జస్ట్‌ హాఫ్‌ మినట్‌ ఇప్పుడే లెటర్‌ ఇచ్చి వస్తా అంటాడు. తొందరపడకండి అంటాడు. ముందు ఒక మాట, వెనక మాట ఎందుకు జ్యోత్స్న అంటాడు. ఇప్పుడు కూడా మీ తాతచెప్పింది చేయ్‌ అంటాడు. దీనికే ఇంత బాధఅవుతే మరి నాకు జరిగిన అన్యాయం ఏంటి? అంటుంది జ్యోత్స్న. తిరిగి తిరిగి అక్కడికే వస్తావు అంటాడు కార్తీక్‌. కార్తీక్‌ బాబు రిజైన్‌ లెట్టర్ ఇవ్వకండి అంటుంది దీప. అయినా వినడు కార్తీక్‌. నాకు నెత్తిమీద వంద కేజీల బరువులా ఉంది అంటాడు. 


క్యాబిన్‌లో నుంచి బయటకు వస్తాడు తాతాగారు.. మనుషులు మార్చడం నీకే చెల్లింది దీప అంటాడు తనకు సంబంధంలేదు. తనే వచ్చింది ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసింది అంటాడు. నేనెప్పుడు మీకు గౌరవం ఇస్తాను అంటుంది. నీ బోడి గౌరవం ఎవరికి కావాలి అంటుంది జ్యోత్స్స. రిజైన్‌ ఇచ్చి మీ పెళ్లాన్ని తీసుకుని వెళ్లు అంటాడు తాతయ్య. ఆగు.. కార్తీక్‌ బాబు తెంచుకుంటే బంధం కాదు, కాగితాలతో తెగిపోయే బంధం కాదు ఆయన మీ తాతయ్య. తను మీ మరదలు  అంటుంది. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి కదా.. కార్తీక్‌ బాబు.. అబ్బబ్బబ్బ... వాడు మమ్మల్ని కాదు అనుకుందే నీకోసం. అసలు నీవు ఎవరు? బంధం ఏంటి? అని నిలదీస్తాడు దీపను తాతయ్య.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..



ఏం బంధం లేదు నువ్వు ఒక అనామకురాలివి. అలాంటి నీకోసం మమ్మల్ని వదులుకుంటున్నాడు. మర్యాద లేని మనిషి పక్కన నిలబడి మర్యాద కోల్పోయాడు. మర్యాద కోసం మా ఇంటికి వచ్చినప్పుడు నీ మర్యాద ఎక్కడికి పోయింది అంటాడు కార్తీక్. మీ ఈగోలు తగ్గించడానికి ఎన్ని మాటలు అయినా తగ్గాలా అంటాడు కార్తీక్‌. నా భార్య ను ఏమైనా అంటే ఊర్కోను అంటాడు, నువ్వు ఓ ఆదర్శమూర్తి మిమ్మల్ని శాలువతో సన్మానం చేసే అవసరం నాకు లేదు.. అంటాడు తాతయ్య.


బావ.. ప్లీజ్‌ నీ మంచి కోరి చెబుతున్నా అప్పుడు కూడా ఇప్పుడు కూడా అంటుంది జ్యోత్స్న. అప్పుడ దీప చెబితే చేశా.. నీ కోసం కాదు అంటాడు కార్తీక్‌. అయితే, ఇప్పుడు కూడా నామాట వినండి బాబు అంటుంది దీప. ఆఫీస్‌ బాయ్‌కు నాకు తేడా లేదు అంటాడు కార్తీక్‌. ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే, ఇక మీరు బయలుదేరొచ్చు అంటాడు తాతయ్య. ఆయన్ని క్షమించండి కావాలనుకుంటే వచ్చిన బంధం కాదు. భగవంతుడు ఇచ్చాడు అంటుంది దీప. కార్తీక్‌ మాత్రం వాళ్లు అర్థం చేసుకోరు అంటాడు. మీ మీద కార్తీక్‌ బాబు కు ఎలాంటి కోపం లేదు  అంటుంది దీప. నువ్వు ఏమైతావు ? నా మనవరాలివా? అంటాడు తాతయ్య. అవును నీ మనవరాలినే తాతయ్య అంటుంది దీప.


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..


ఎంటన్నావ్‌? నువ్వు నా మనవరాలివా? అంటాడు అవును తాతయ్య ఉగాది రోజు మీర అన్నారు కదా తాతయ్య అనిపిలువు. నా మనవరాలిలాంటిదాన్ని అంటాడు. అభిమానం అడ్డుపెట్టుకుని ఆడుకుంటున్నావ్‌ అంటాడు. ఒక వేళ నా మనవరాలు అనితెలిస్తే పుట్టగానే నిన్ను ఏ బస్టాండ్‌లో నో వదిలేసేవాడిని అంటాడు తాత శివన్నారాయణ. మీరంతా నిజం తెలియకుండా నిజానికి దగ్గరగా మాట్లాడుతున్నారు అని మనస్సులో అనకుంటుంది జ్యోత్స్న. అప్పుడు నిన్ను అంతలా అసహ్యహించుకుంటున్నా నిన్ను నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావా? అని నిలదీస్తాడు శివన్నారాయణ.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.