Karthikeya 2 Crosses Laal Singh Chaddha: `లాల్`కు షాకిచ్చిన కార్తికేయ 2.. మాములు దెబ్బ కాదుగా!
Karthikeya 2 Crosses Laal Singh Chaddha Collections: కార్తికేయ 2 సినిమాకు ఊహించని మేర కలెక్షన్లు వస్తున్నాయి. ఆ సినిమా ఏకంగా లాల్ సింగ్ చద్దా కలెక్షన్స్ దాటేసినట్టు చెబుతున్నారు.
Karthikeya 2 Crosses Laal Singh Chaddha Collections: కార్తికేయ 2 సినిమాకు ఊహించని మేర కలెక్షన్లు వస్తున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం కార్తికేయ 2. 2014లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా రూపొందించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ తెచ్చుకుంటూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మూడున్నర కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు మూడు కోట్ల 81 లక్షలు, మూడో రోజు నాలుగు కోట్ల 23 లక్షలు, నాలుగు రోజు రెండు కోట్ల 17 లక్షలు, ఐదో రోజు కోటి 61 లక్షలు, ఆరవ రోజు కోటి 34 లక్షల వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల 66 లక్షల వసూలు చేసిన ఈ సినిమా కర్ణాటక సహా మిగతా దేశమంతా కోటి 35 లక్షలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో రెండు కోట్ల 90 లక్షల సాధించింది.
నార్త్ లో రెండు కోట్ల 75 లక్షల వసూళ్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజులకు దాము 23 కోట్ల 66 లక్షల షేర్ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా బిజినెస్ కేవలం 12 కోట్ల 80 లక్షల రూపాయలకు జరగగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్ల 30 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే టార్గెట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 10 కోట్ల 36 లక్షల లాభంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నార్త్ లో గత కొద్దిరోజులుగా సత్తా చాటుతున్న ఈ సినిమా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా వసూళ్లను మంగళవారం నాటి నుంచి దాటేసింది అని అంటున్నారు.
నానా కష్టాలు పడితే కానీ ఆరు రోజులకు ఈ లాల్ సింగ్ చద్దా సినిమా 50 కోట్ల మార్కు దాటడానికి కుదరలేదు. నార్త్ లో కార్తికేయ 2 సినిమా 50 స్క్రీన్లతో మొదలై 1000 స్క్రీన్లకు వెళ్ళింది. లాల్ సింగ్ చద్దా సినిమా తీసేసి మరీ కార్తికేయ 2 సినిమాకు స్క్రీన్లు ఇస్తున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక జన్మాష్టమి రోజున అయితే ఏకంగా 3000 షోలు వేయబోతున్నారని తెలుస్తోంది. ఈ దెబ్బతో నార్త్ లో మన సినిమాలు సత్తా చాటుతున్నాయని చెప్పచ్చు.
Also Read: Wanted Pandugod Movie Review: ‘సునీల్-సుడిగాలి సుధీర్-అనసూయ’లు నటించిన ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ రివ్యూ
Also Read: Karthikeya 2 : సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'కార్తికేయ 2'... దర్శకుడికి బిగ్ బీ ప్రశంస..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి