Karthikeya 2 : సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'కార్తికేయ 2'... దర్శకుడికి బిగ్ బీ ప్రశంస..!

Karthikeya 2 : యువ నటుడు నిఖిల్, దర్శకుడు చందూ మెుండేటి కాంబోలో తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందాన్ని ప్రశంసించారు బాలీవుడ్ దిగ్గజ నటుడు, బిగ్ బీ అమితాబ్.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 01:18 PM IST
Karthikeya 2 : సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'కార్తికేయ 2'... దర్శకుడికి బిగ్ బీ ప్రశంస..!

Karthikeya 2 : నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' అందరి అంచనాలను తలకిందులు చేస్తూ...రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన ప్రతి చోట అదిరిపోయే వసూళ్లను రాబడుతూ... అందరి మన్ననలను అందుకుంటుంది. హిందీలో అయితే ఆమిర్​ ఖాన్ లాల్​సింగ్​ చడ్డా, అక్షయ్​కుమార్​ రక్షాబంధన్​ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. చందూ మెుండేటి తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి (Karthikeya 2) అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ విజయంతో మాంచి ఊపు మీదున్న డైరెక్టర్ చందూ మెుండేటికి ఊహించని సంఘటన ఎదురైంది. బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​ను (Amitabh Bachchan) కలిసే అవకాశం వచ్చింది.

తాజాగా బిగ్ బీ 'కార్తికేయ' చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడు చందూ మొండేటిని స్వయంగా పిలిచి అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు చందూ మెుండేటి. బిగ్ బీని కలవడం జీవితంలోని మరచిపోలేని సంఘటన అని ఆయన రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 13న రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించారు. కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. కార్తికేయ 2 సినిమాకు క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. 

Also Read: Vijay Devarakonda Arrogant Behaviour: విజయ్ దేవరకొండ బలుపు వెనకున్న అసలు కధ ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News