Kartikeya Raja Vikramarka gets a release date: ‘చావు కబురు చల్లగా’ చిత్రం తర్వాత హీరో కార్తికేయ (Kartikeya) నటిస్తోన్న మూవీ ‘రాజా విక్రమార్క’ (Raja Vikramarka). శ్రీసారిపల్లి (Sri Saripalli) దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజా విక్రమార్క సినిమా రిలీజ్‌ డేట్‌ను మూవీ యూనిట్ ప్రకటించింది. నవంబర్‌ 12న ‘రాజా విక్రమార్క’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


Also Read : Avinash Wedding: పెళ్లి చేసుకున్న అవినాష్.. 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటున్న రాంప్రసాద్



యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో కార్తికేయ (Kartikeya) సరసన తన్యా రామచంద్రన్‌ (Tanya Ravichandran) కనిపించనున్నారు. సాయి కుమార్‌, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి రమా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే ‘రాజా విక్రమార్క (Raja Vikramarka) టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.



 


Also Read : AP Bundh:ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్​- పట్టాభి క్షమాపణకు వైసీపీ డిమాండ్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook