Sai Pallavi Kashmir Genocide: కశ్మీర్ పండిట్ల హత్యలు, గో హత్యలకు తేడా ఏముంది.. సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు!
Sai Pallavi Controversial Comments on Kashmir genocide goes viral. తాజాగా సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Sai Pallavi Controversial Comments goes viral: వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. డి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది. విరాటపర్వం ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయం గురించి మాట్లాడుతూ.. ఆపై కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ముందుగా నక్సల్స్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ... 'వాళ్లది ఒక ఐడియాలజీ, మనకు శాంతి అనేది ఓ ఐడియాలజి. నాకు వయలెన్స్ అస్సలు నచ్చదు. వయలెంట్‌గా ఉండి సాధించగలమని ఇప్పుడు నేను నమ్మను. ఆ టైంలో ఎవరికీ తెలియదు.. ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలో తెలియదు. అందుకే వారంతా ఓ గ్రూపుగా మారారు. అయితే వాళ్లు చేసింది తప్పా, రైటా అని చెప్పలేను. నేను తటస్థ వాతావరణంలో పెరిగాను. లెఫ్టిస్ట్ మరియు రైటిస్ట్ గురించి విన్నాను. కానీ ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అని నేను చెప్పలేను' అని అన్నారు.
'పాకిస్థాన్‌లో ఉన్న జనాలకి మన జవాన్లు టెర్రరిస్ట్‌లా అనిపిస్తారు. ఎందుకంటే మనం హార్మ్ చేస్తామనుకుంటారు. మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఏది తప్పు ఏది రైట్ అని చెప్పడం చాలా కష్టం. మా ఫ్యామిలీలో లెఫ్ట్, రైట్ అని ఉండదు. అందులో ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని చెప్పలేను. మనం మంచిగా ఉండి, ఎవరిని హార్ట్ చేయకుండా ఉంటే చాలు. బాధితుల గురించి ఆలోచించాలి' అని సాయి పల్లవి పేర్కొన్నారు.
'కాశ్మీరీ పండిట్‌లను ఎలా చంపారో ఇటీవల వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించారు. మనం వాటిని మత సంఘర్షణలా చూస్తున్నాము. కొన్ని రోజుల క్రితం ఒక బండిలో ఆవుని తీసుకెళ్తున్నారు. అందులో డ్రైవర్ ముస్లిం అతను ఉన్నాడు. కొంతమంది అతడిని కొట్టి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు జరిగిన దానికి.. ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది. మతాలు కాదు.. మనం మంచి వ్యక్తిగా ఉండాలి. ఇతరులను బాధించకుండా ఉంటే.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మంచిగానే ఉంటుంది' అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. సాయి పల్లవిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.
Also Read: Deepika Padukone Hospitalised: ఆస్పత్రిలో దీపికా పదుకొణె.. ఆగిన 'ప్రాజెక్ట్ కె' షూటింగ్!
Also Read: Raai Laxmi Bikini Pics: రాయ్ లక్ష్మి అందాల విందు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook