Kathi Mahesh's death: కత్తి మహేష్ కన్నుమూశారు. జూన్ 26న నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్‌ని తొలుత నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మహేష్ కత్తి (Mahesh Kathi) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ శనివారం తుదిశ్వాస విడిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోడ్డు మార్గం గుండా కలకత్తా బయల్దేరిన కత్తి మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కత్తి మహేష్ చికిత్స కోసం ఏపీ సర్కారు రూ. 17 లక్షలు ఆర్థిక సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. హైదరాబాద్ యూనివర్శిటీలో పీజీ చేసిన కత్తి మహేష్.. డెవలప్‌మెంట్ కమ్యునికేషన్‌లో కెరీర్ ఆరంభించారు. అదే క్రమంలో పలు ఎన్జీవోలతో కలిసి పనిచేసిన కత్తి మహేష్ (Kathi Mahesh) ఆ తర్వాత ఫిలిం జర్నలిస్టుగా సినీరంగంలో రానించారు.


Also read : Naga Chaitanya బాలీవుడ్ ఎంట్రీ మూవీ Laal Singh Chaddha స్టిల్ ట్రెండింగ్, ఆర్మీ లుక్‌లో చైతూ


పెసరట్టు సినిమాతో (Pesarattu movie) 2015 లో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కత్తి మహేష్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షోలోనూ కంటెస్టంట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే.


Also read: Arjun Sarja: హనుమాన్ టెంపుల్ నిర్మించిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, Hanuman Temple Photos


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook