Katrina-Vicky Wedding: బాలీవుడ్ లో ఇప్పుడు కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ పెళ్లి(Katrina-Vicky Wedding) హాట్‌టాపిక్‌గా మారింది. వివాహం వరకు గోప్యత పాటించిన ఈ జంట...అనంతరం వరుసపెట్టి ఫోటోలు షేర్ చేస్తున్నారు. దీంతో ఆ పిక్స్ నెట్టింట వైరల్(Viral)గా మారాయి. ఇటీవల రాజస్థాన్‌లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వీరికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఖరీదైన బహుమతులు(Costly Gifts) అందినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో కత్రినా(Katrina Kaif ) మాజీ ప్రియులు రణ్‌బీర్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌లు ఉండటం విశేషం. కత్రీనా పెళ్లి సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు  రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) 2.7 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ బహుమతిగా ఇవ్వగా.. ఈ కొత్త జంటకు బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) 3 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును కానుగా ఇచ్చిన‌ట్టు బి-టౌన్‌లో జోరుగా ప్ర‌చారం జరుగుతోంది. 


Also Read: Katrina, Vicky haldi ceremony : పసుపు రాసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిన క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్‌..


వీరితోపాటు అలియా భట్‌ లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్‌ను కత్రినాకు పంపగా...రూ. 6.4లక్షల విలువైన డైమండ్ చెవి దుద్దులను విరూష్కలు గిఫ్ట్‌ పంపించినట్లు తెలుస్తోంది. అలాగే షారుఖ్ ఖాన్ వారి పెళ్లిలో రూ. 1.5 లక్షలు విలువ చేసే పెయింటింగ్‌ను ఇవ్వగా, హృతిక్ రోషన్(Hrithik Roshan)..విక్కీ(Vicky Kaushal)కి 3 లక్షల రూపాయలు విలువ చేసే బీఎండబ్య్లూ జీ310 ఆర్ బైక్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తాప్సీ కూడా విక్కీకి  1.4లక్షల రూపాయల విలువైన ప్లాటినం బ్రెస్‌లెట్‌ను గిప్ట్ గా ఇచ్చినట్లు సమాచారం.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook